Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా

By:  Tupaki Desk   |   28 Dec 2022 1:35 PM GMT
ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా
X
నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్ స్టాప‌బుల్ విద్ ఎన్ బి కె ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీజ‌న్ 1 సూప‌ర్ హిట్ కాడంతో రీసెంట్ గా సీజ‌న్ 2 ని ఆహా ఓటీటీ వ‌ర్గాలు తాజాగా మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. సీజ‌న్ 1 కి మించి సీజ‌న్ 2 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం.. ఇంత కు ముందు ఈ షోలో పాల్గొనని స్టార్స్ తాజా సీజ‌న్ కోసం త‌ర‌లి వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో తాజా సీజ‌న్ పై మ‌రింత ఆస‌క్తి నెల‌కొంటేంది.

ఈ సీజ‌న్ లో ఎప్పుడెప్పెడు ప్ర‌భాస్ పై ప్ర‌త్యేక‌ ఎపిసోడ్ చేస్తారా? .దాన్ని ఎప్పుడెప్పుడు చూసేయ్యాలా అని ఆశ‌గా ఎదురు చూసిన ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎదురు చూపుల‌కు తెర ప‌డింది.

రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, హీరో గోపీచంద్ ఇద్ద‌రూ క‌లిసి నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2`లో పాల్గొన‌డం, వీరికి సంబంధించిన ప్రోమో విడుద‌ల కావ‌డం తెలిసిందే. ప్ర‌మో ప్ర‌స్తుతం నెట్టింట రికార్డులు సృష్టిస్తూ వైర‌ల్ గా మారుతున్న వేళ ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి ఆహా టీమ్ డ‌బుల్ స‌ర్ ప్రైజ్ ని ప్లాన్ చేసింది. ప్ర‌భాస్, గోపీచంద్ పై చేసిన తాజా ఎపిసోడ్ ని డిసెంబ‌ర్ 30న స్ట్రీమింగ్ చేయ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించింది.

అయితే ప్ర‌భాస్ ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో ఫుటేజ్ ని క‌ట్ చేయ‌డానికి టీమ్ కు మ‌న‌సొప్ప‌లేద‌ట‌. అంత ఇంట్రెస్టింగ్ గా వుండ‌టంతో ప్ర‌భాస్‌, గోపీచంద్ ల‌కు సంబంధించిన ఎపిసోడ్ ని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయాల‌నుకున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిస్తూ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని అభిమానుల‌తో పంచుకున్నారు.

ప్ర‌భాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా క‌ట్ చేసి మొద‌టి భాగాన్ని `బాహుబ‌లి ఎపిసోడ్ పార్ట్‌ 1 ది బిగిర‌నింగ్‌` గా రెండ‌వ ఎపిసోడ్ ని `బాహుబ‌లిఎపిసోడ్ పార్ట్ 2 ది క‌న్‌క్లూజ‌న్ ` గా అందించ‌బోతున్నారు. ఫ‌స్ట్ పార్ట్ ని డిసెంబ‌ర్ 30, సెకండ్ పార్ట్ ని జ‌న‌వ‌రి 6న స్ట్రీమింగ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. `కంటెంట్ చాలా బాగుంద‌ని, దాన్ని చాలా బాగుంద‌ని, దాన్ని ఎడిట్ చేయ‌డానికి ఎవ‌రూ అంగీక‌రించ‌లేద‌ని, అందుకే సెట్స్ నుంచి డైరెక్ట్ ప్లే టు ప్లే` అంటూ ట్వీట్ చేసింది ఆహా టీమ్‌. ఈ వార్త నిజంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా అన్న‌ట్టే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.