Begin typing your search above and press return to search.

తెలుగు రాణి.. ఇంకా తేల్చలేదట

By:  Tupaki Desk   |   30 Nov 2016 10:30 PM GMT
తెలుగు రాణి.. ఇంకా తేల్చలేదట
X
బాలీవుడ్ మూవీ క్వీన్ ను.. సౌత్ లోని నాలుగు భాషల్లోనూ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఏడాది ముందు నుంచి వార్తల్లో నానుతున్న ఈ ప్రాజెక్టుపై.. రీసెంట్ గానే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశాడు నిర్మాత త్యాగరాజన్. తెలుగు.. తమిళ్.. మలయాళం.. కన్నడ భాషల్లో వేరువేరు దర్శకులు.. వేరువేరు హీరోయిన్లతో ఈ సినిమా చేయనున్నారు. తెలుగు తప్ప మిగతా భాషలకు సంబంధించి క్లారిటీ వచ్చేసినా.. తెలుగులో లీడ్ రోల్ ఎవరు చేస్తారో మాత్రం తేలలేదు.

తెలుగులో ఈ చిత్రాన్ని అనీష్ కురువిల్లా డైరెక్ట్ చేస్తాడనే అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది. కానీ తమిళ్ వెర్షన్ ను తమన్నా చేస్తుండడం.. తెలుగులో మిల్కీకి బోలెడంత క్రేజ్ ఉండడంతో.. టాలీవుడ్ క్వీన్ లో కూడా తమ్మూనే నటిస్తోందని అంచనా వేసేశారు. కానీ మేకర్స్ చెబుతున్న ప్రకారం అయితే.. తెలుగు వెర్షన్ క్వీన్ లో తమన్నా నటించే అవకాశం లేదట. ఒక్కో భాషలో ఒక్కో హీరోయిన్ నటింపచేయాలనే మాటకు కట్టుబడి ఉన్నాడట నిర్మాత. తెలుగు క్వీన్ విషయంలో హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదని ఇప్పుడు తేలిపోయింది.

క్వీన్ తెలుగులో తమ్మూ లేదని తేల్చేయడంతో.. టాలీవుడ్ లో మిల్కీకి ఒక్క మూవీ కూడా లేకుండా పోయింది. బాహుబలి2 కోసం ఇప్పటికే ఈమె వెర్షన్ కంప్లీట్ కావడంతో.. మరే తెలుగు సినిమా ఈ భామ చేతిలో లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/