Begin typing your search above and press return to search.
ఫోకస్: ముద్దుల్లో అన్ని రకాలు ఉన్నాయట!
By: Tupaki Desk | 28 Jun 2019 10:30 AM GMTముద్దులంటే అందరికీ ఇష్టమే. ఇక హద్దులు చెరిగిపోయే ముద్దులు అంటే యూతుకు మహా ఇష్టం. సినిమాల విషయమే తీసుకుంటే అప్పట్లో ముద్దులంటే 'సూర్యుడు.. కదిలే ఆకులు.. ఒకదానికి ఒకటి రాసుకు పూసుకునే పువ్వులు.. జంట పక్షులు'. ముద్దు అంటే రెండు జత పెదవులు కావాలి.. కనీసం ఒక జత పెదవులైనా ఉండాలి. కానీ అప్పట్లో కఠినమైన సెన్సార్ చట్టాలు ఉండేవి. అదే ప్రెజెంట్ జెనరేషన్ సినిమాలు చూడండి.. అన్నీ లిప్పు లాకులే. 'కబీర్ సింగ్' లో లో బైక్ పై పోతూ ముద్దు పెట్టుకొని కింద పడిపోతారు. అయినా 'ఆఫ్టర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్' అన్నట్టుగా లేచి ఆ ఘాటు ముద్దును నిరాఘాటంగా కొనసాగిస్తారు.
బాలీవుడ్ జనాలు 'కబీర్ సింగ్' సినిమాపై తెగ విమర్శలు చేశారుగా.. అందులోనూ ఈముద్దును మరీ ఘాటుగా విమర్శించారు. ఒక లేడీ క్రిటిక్.. "ఈ ముద్దులో ప్రేమ ఎక్కుడుంది.. కోరిక.. కామం మాత్రమే ఉంది" అంటూ దుయ్యబట్టింది. అంటే ఆమె లెక్క ప్రకారం కదలకుండా నిలబడి యోగా గురువు గారు టీవీలో చెప్పినట్టు.. స్లో బ్రీతింగ్ లో అంతకంటే స్లో మోషన్ లో కిస్సు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అది ప్రేమ ముద్దు అయిపోతుందా? అయినా కబీర్ సింగు ఇంటెన్సు.. అయన గర్ల్ గ్రెండ్ కూడా అంతే.. వారు ఈ క్రిటిక్ ఆశించినట్టుగా సంప్రదాయ పద్ధతిలో ఎందుకు కిస్సు చేసుకుంటారు? లాజిక్ మిస్ కావడం అంటే ఇదే!
ఇక్కడ మన టాపిక్ ఆ ముద్దు.. ప్రేమ ముద్దా.. కామం ముద్దా.. ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ లు విడుదలైన తర్వాత పెట్టుకున్న ముద్దా అని కాదు. 'కబీర్ సింగ్' ఘాటు ఛుమ్మా ఆ క్రిటిక్ కు నచ్చ లేదు. ఈ క్రిటిక్ గోలలో అసలు ముద్దుల్లో ఎన్ని రకాలు ఉన్నాయని గూగుల్ లో శోధన చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఫోబియాలు వందరకాలకు పైగా ఉంటాయి కదా అలానే ఈ ముద్దులు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిపై ఒకసారి దృష్టి సారిద్దాం. ఇది అసలే హాటు టాపిక్.. మీకెవరికైనా అభ్యంతరాలు ఉంటారు ఇది ఇంతటితో ఆపేసి హాయిగా వేరేవి చదువుకోండి. ఇదంతా లొట్టలేస్తూ చదివిన తర్వాత 24 క్యారెట్ హిపోక్రాట్ లాగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు.. ఆ!
*లిప్ కిస్: ఇది ఉన్నవాటిలో బేసిక్ మోడల్ అంట!
*ఫ్రెంచ్ కిస్: ఇది ఘాటు మహానుభావుల కోసం. ఇంట్లో ఈశాన్యం కార్నర్ లో బోర్ వేసి నీళ్ళు లాగుతారు కాదా సరిగ్గా.. ఆ లెక్క జెయ్యాలె!
*నెక్ కిస్: ఇది మెడపై పెట్టె కిస్సు. ఇందులో రెండు రకాలు ఉన్నాయట.. ఒకటి సాఫ్ట్. రెండోది డ్రాక్యులా లాగా రక్తం తాగినట్టు గాట్లు పెట్టడం అంట. ఇదసలే ఫెమినిస్టుల కాలం. మీరు గట్టిగా గాట్లు పెట్టి ఇబ్బంది పెడితే మీ పార్టనర్ మీ మెడ కొరికి నిజం రక్త పిశాచిలా రక్తం తాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త!
*బైట్ కిస్: ఇది గాటు పెట్టే కిస్.. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు కానీ కాస్త సెన్సిబుల్ గా ప్రవర్తించడం అనేది మాత్రం మినిమమ్ కామన్ సెన్స్. నీ పెన్సిల్ లాక్కున్నారనే కోపంతో పెట్టే గాట్ల మాదిరిగా.. కుక్క కాట్ల మాదిరిగా కాదు.
*లిజార్డ్ కిస్: పేరులోనే ఉంది కదా. గోడకు బల్లి అంటుకున్నట్టు మీరు మీ భాగ స్వామిని బల్లిలాగా అంటుకొని ఫ్రెంచ్ కిస్ ఇవ్వాలి.. ఫ్రెంచ్ కిస్ కు దీనికి తేడా ఏంటంటే.. ఇది ఒక నిముషంలో ఆగేది కాదు.. సా.. గు..తు.. నే ఉంటుంది. ఫ్రెంచ్ కిస్ 2.0 అనుకోండి!
*ఇయర్ లోబ్ కిస్: చెవులను సుతారంగా వీణ మీటినట్టుగా మీటడం.. కమ్మలు పెట్టుకునే చోట నెర్వ్ ఎండింగ్స్ ఉంటాయట. అందుకే ఈ కిస్సు ప్రత్యేకమైనదట.
*స్పైడర్ మ్యాన్ కిస్: స్పైడర్ మ్యాన్ సినిమా రిలీజ్ తర్వాత ఈ కిస్సు పాపులర్ అయిందట. ఏం లేదు. మీరు స్పైడర్ మ్యాన్ లా తలక్రిందులుగా వేలాడుతూ మీ భాగస్వామికి లిప్ లాక్ చెయ్యాలట. జాగ్రత్త బాబోయ్.. జాగ్రత్త.. మీకు వీలు కాకపోతే సోఫాలో రివర్స్ లో పడుకొని మీ బాధ్యత నిర్వర్తించండి. లేనిపోని పంతాలకు పట్టింపులకు పోయి.. కుయ్యి కుయ్యిమనే 108 ను పిలిచే పరిస్థితి కల్పించకండి.
*బటర్ ఫ్లై కిస్: ఈ కిస్సుకు పెదవులతో పని లేదు. మీ మొహాన్ని మీ భాగస్వామి మొహానికి ఒక్క మిల్లీ మీటర్ గ్యాప్ లేకుండా పెట్టాలి. ఆ సమయంలో మీ కనురెప్పలను వేగంగా మూస్తూ తెరుస్తూ ఉండాలి. దీంతో మీ భాగస్వామికి సీతాకోక చిలుక రెక్కలను తాకించినట్టుగా అనిపిస్తుందట. మీ పార్టనర్ మాస్ మాలోకం అయితే మాత్రం సచ్చింది గొర్రె!
*సింగిల్ లిప్ కిస్: ఒక పెదవిపై గట్టిగా ఫోకస్ చేయడం.
ఇవి కాకుండా చీక్ కిస్... ఎస్కిమో కిస్.. ఫోర్ హెడ్ కిస్.. హ్యాండ్ కిస్ ఉన్నాయి. అయితే ఇవి సెక్సువల్ పార్టనర్స్ మధ్యే కాదు.. ప్రేమను వ్యక్తపరిచేవి కాబట్టి 'ఆ' కిస్సుల కిందకు రావు. వీటిలో పదాలన్నీ మీకు తెలిసినవే.. ఒక ఎస్కిమో కిస్ మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎస్కిమో కిస్ అంటే.. మీ ముక్కును మీ పార్ట్ నర్ ముక్కుతో రబ్ చేయడం. అంతే. ఈ రోజుకు కిస్సుల పురాణం ఇంతే బాబులు!
గమనిక: నాయనలారా.. ఏదో అవగాహన కోసమని ఇచ్చే ఆత్మజ్ఞానం ఇది. ఈ విజ్ఞానాన్ని అజ్ఞానంగా ఎక్కడపడితే అక్కడ వాడకండి. అసలే #మీటూ అని #వుయ్ టూ అని గట్టిగా తగులుకుంటున్నారు!