Begin typing your search above and press return to search.

#BEBO హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదు అన్ని ల‌క్ష‌లే

By:  Tupaki Desk   |   21 Dec 2019 10:45 AM GMT
#BEBO హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదు అన్ని ల‌క్ష‌లే
X
సంఘంలో సెల‌బ్రిటీ హోదాని కాపాడుకోవాలంటే అంత వీజీనా? పైగా ప‌టౌడీలు.. న‌వాబ్ లు క‌పూర్ లు .. ఖాన్ లు అంటే ఆ రేంజే వేరుగా ఉంటుంది. ప‌నిలో ప‌నిగా బాలీవుడ్ సెల‌బ్రిటీ అయితే రంగుల‌ ప్ర‌పంచంలో ఇంకా ఎన్నో చిత్ర‌విచిత్రాలు ఉంటాయి. అలాంటి ఫేజ్ 3 వ‌ర‌ల్డ్ లో ప్రెస్టేజీని కాపాడుకోవాలంటే బాగా చేతిచమురు కూడా వ‌దిలించుకోవాలి. అయితేనేం ప‌టౌడీ కోడ‌లు ఆ రేంజుకి ఎందులోనూ త‌గ్గ‌దు. బాత్రూమ్ కి వెళ్లాల‌న్నా ఖ‌రీదైన బ్రాండెడ్ చెప్పులే కావాలి. జిమ్ కి వెళితే బ్రాండ్ త‌ళ‌త‌ళ‌లాడాలి. అలాంటిది గారాల కుమారుడి బ‌ర్త్ డేలో వంద‌లాది సెల‌బ్రిటీల మ‌ధ్య న‌డియాడాలంటే .. చేతికి ఎలాంటి హ్యాండ్ బ్యాగ్ కొనాలి?

ఇదిగో స‌రిగ్గా ఇలాగే ఆలోచించింది బెబో క‌రీనాక‌పూర్. అస‌లు బెబో అంటేనే స్టైల్. ఫ్యాష‌న్ కి ప‌ర్యాయ‌ప‌దం. జీరో సైజ్ బ్రాండ్ అంబాసిడ‌ర్. ఇప్పుడు మ‌మ్మీ అయ్యింది కానీ... త‌నలో ఇంకా టీనేజీ గాళ్ మెరుపులు ఏమాత్రం త‌గ్గ‌లేదు. త‌గ్గకూడ‌ద‌నే.. రెగ్యుల‌ర్ గా జిమ్ చేస్తూ ఫిజికల్ ఫిట్ నెస్ ని కాపాడుకుంటోంది. సైఫ్ కి భార్య అయినా.. థైమూర్ అలీఖాన్ కి మ‌మ్మీ అయినా కానీ.. ఇంకా బాలీవుడ్ లో ది బెస్ట్ బెబోనే అనేది ఫ్యాన్స్ ఫీలింగ్.

నిన్న‌టికి నిన్న తైమూర్ బ‌ర్త్ డే పార్టీకి బాలీవుడ్ సెల‌బ్రిటీ ప్ర‌పంచం దిగొచ్చింది. ఆ వేడుక‌లో క‌రీనా హొయ‌లు అంతే చర్చ‌కొచ్చాయి. బ్రిట‌న్ మ‌హారాణి క్యాట్ వాక్ చేస్తోందా అన్న తీరుగా.. స్టైల్ గా క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి.. మినీ బ్లాక్ డ్రెస్ లో డిజైన‌ర్ లుక్ తో క‌ట్టిప‌డేసింది. ఆ డ్రెస్ పై డాట్స్ వ్వావ్ అనిపించాయి. అయితే తాను ఎలాంటి డ్రెస్ ధ‌రించినా అంద‌రి క‌ళ్లు ఆ ఖ‌రీదైన హ్యాండ్ బ్యాగ్ పైనే ప‌డ్డాయ‌ట‌. బెబో భుజానికి వేలాడిన ఆ హ్యాండ్ బ్యాగ్ ఖ‌రీదు విని నోరెళ్ల‌బెట్టాల్సిందే ఎవ‌రైనా. ప్ర‌ఖ్యాత‌ లూయీస్ వీట‌న్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ని ప్ర‌త్యేకించి ఈ పార్టీ కోస‌మే కొనుక్కుంది. దీని ఖ‌రీదు 3.90 ల‌క్ష‌లు అని తెలిసింది. ఇంత ఖ‌రీదైన‌ బ్యాగ్ తో తైమూర్ బ‌ర్త్ డేలో వేరొక‌రికి ఛాన్సివ్వ‌కుండా.. మ‌మ్మీ గారే షో స్టాప‌ర్ గా నిల‌వ‌డం చ‌ర్చ‌కొచ్చింది.