Begin typing your search above and press return to search.
బోనీకపూర్ ఫ్యామిలీకి యూఏఈ ప్రభుత్వం అరుదైన గౌరవం
By: Tupaki Desk | 12 Nov 2021 12:30 AM GMTదుబాయ్.. ఈ గల్ఫ్ దేశం అన్ని పక్క దేశాలలాగా పెట్రో ఉత్పత్తులపై ఆధారపడకుండా ప్రత్యామ్మాయ రంగాలను అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, పర్యాటక రంగం, ఇతర వినోద రంగాలకు పెద్దపీట వేస్తూ అన్ని దేశ ప్రజలను అమితంగా ఆకర్షిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రపంచంలోని ప్రముఖులకు ఫ్యామిలీ గోల్డెన్ వీసా అందజేస్తూ వారి ఆదరాభిమానాలను చూరగొంటోంది. కళాకారులను, పెట్టుబడిదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దుబాయ్ ప్రభుత్వం కొంతమంది ప్రముఖులకు 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు అందిస్తోంది.
ఈ క్రమంలోనే భారతదేశానికి ప్రముఖ నిర్మాత, సినీ ఫ్యామిలీ అయిన బోనీకపూర్ కుటుంబానికి తాజాగా దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేసింది. దుబాయ్ కు రెగ్యులర్ గా వచ్చే బోనీకపూర్ ఫ్యామిలీకి ఈ సదావకాశాన్ని కల్పించింది.
ఈ సంవత్సరం బోనీకపూర్ తోపాటు తన నలుగురు పిల్లలకు ఈ వీసా మంజూరు చేిసంది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా బోనీ కపూర్ కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ తో కలిసి వీసాలను అందుకున్నారు. దుబాయ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా బోనీ కపూర్ ఫ్యామిలీ ధన్యవాదాలు తెలిపింది.