Begin typing your search above and press return to search.
విశ్వనటుడి తర్వాత ఆ స్థానం ఉదయ్ కిరణ్ కే!
By: Tupaki Desk | 31 Dec 2021 5:30 AM GMTదివంగత నటుడు ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోగా `చిత్రం`తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగాడు. వరుస విజయాలతో టాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఖ్యాతికెక్కాడు. చిత్రం తర్వాత `నువ్వు నేను`..`మనసంతా నువ్వే` చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు. వారసులు లేని రాజ్యంలో ఉదయ్ కిరణ్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. మెగాస్టార్ చిరంజీవి ఇంట అల్లుడు అయ్యేంతగా ఫేమస్ అయ్యాడు. అయితే యంగ్ హీరో కెరీర్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా ఫెయిల్యూర్స్ ఆయన్ని వెనక్కి నెట్టాయి.
ఆ తర్వాత వైవాహిక జీవితం.. ఇబ్బందులు ఆయన్ని తీవ్ర డిప్రెషన్ లోకి నెట్టేసాయి. అయినా వాటిని సైతం ఎదుర్కొని కొన్నాళ్ల పాటు కెరీర్ ని మళ్లీ ట్రాక్ లోకిఎక్కించాలని గట్టి ప్రయత్నాలు చేసాడు. అయినా తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. చిత్రం తో మదలైన సినీ ప్రయాణాన్ని అదే చిత్రం చెప్పిన కథతో ముగించాడు. తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అలా ఉదయ్ కిరణ్ జీవితం ముగిసింది. అయితే విశ్వనటుడు కమల్ హాస్ తర్వాత అంతటి ఖ్యాతిని ఉదయ్ కిరణ్ దక్కించుకున్నాడు. కమల్ హాసన్ తర్వా నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కుడిగా ఉదయ్ రికార్డుకి ఎక్కాడు.
ఉదయ్ కిరణ్ చివరిగా `చిత్రం చెప్పిన కథలో` నటించాడు. ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంతలోనే ఉదయ్ కిరణ్ శ్రీనగర్ కాలనీ నివాసం ఉంటోన్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చివరి సినిమా చూసుకోకుండానే ఉదయ్ తనువు చాలించాడు.