Begin typing your search above and press return to search.
పెళ్లి రద్దు నిర్ణయం ఉదయ్ కిరణ్ దే
By: Tupaki Desk | 8 July 2017 8:01 AM GMTఫిలిం ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా ప్రవేశించి స్వయం కృషితో పైకెదిగిన నటుల్లో ఒకడు ఉదయ్ కిరణ్. ఎంత త్వరగా లైమ్ లైట్ లోకి వచ్చాడో అంత త్వరగా తెరమరుగైపోయాడు. ఒకానొక టైంలో ఉదయ్ కిరణ్ యూత్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్ మంచి ఊపులో ఉండగా మెగాస్టార్ చిరంజీవి ఇంటి అల్లుడయ్యే అవకాశం వచ్చింది. చిరంజీవి కుమార్తె సుస్మితతో ఎంగేజ్ మెంట్ కూడా అయ్యాక పెళ్లి క్యాన్సిల్ అయింది. ఉదయ్ కిరణ్ అతి పెద్ద తప్పిదం ఇదేనని సినిమా లవర్స్ అంటుంటారు. ఈ పెళ్లి క్యాన్సిల్ అవడానికి ఉదయ్ కిరణ్ కెరీర్ స్పాయిల్ కావడానికి చిరంజీవే కారణమని కొంతమంది నిందిస్తుంటారు.
సుస్మితతో పెళ్లి రద్దు నిర్ణయం ఉదయ్ కిరణ్ దేనని.. చిరంజీవిది కానేకాదని ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి చెప్పారు. కొంతకాలంగా ఫ్యామిలీతో కలిసి మస్కట్ లో ఉంటున్న ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్న మూడేళ్ల తర్వాత ఈ విషయంలో పెదవి విప్పారు. ‘‘సుస్మితతో ఎంగేజ్ మెంట్ జరగక ముందు నుంచే ఉదయ్ కిరణ్ కు చిరంజీవి ఎంతో సపోర్ట్ నిచ్చారు . అతడు కష్టకాలంలో ఉన్నప్పుడు (లేడీ జర్నలిస్ట్ తో బ్రేకప్ అయిన సమయంలో) చిరంజీవిగారు ఎంతో అండగా నిలిచారు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికీ సిద్ధపడ్డారు. మేము ఒకసారి ఆయన ఇంటికి వెళ్లాం. వారి ఆతిథ్యం అద్భుతమనే చెప్పాలి. కానీ ఎందుకో సుస్మితతో తనకు సరిపడదని ఉదయ్ భావించాడు. తనతో సర్దుకుపోగలనని అనుకోలేకపోయాడు. దాంతో పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది పూర్తిగా అతడి నిర్ణయమే. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ చిరంజీవి ఫ్యామిలీతో టచ్ లోనే లేడు’ అంటూ శ్రీదేవి చెప్పారు.
‘తర్వాత కాలంలో విషితతో ఉదయ్ వివాహం జరిగింది. ఎందుకో వాళ్లిద్దరూ సంతోషంగా ఉండలేకపోయారు. అతడి పెళ్లి తర్వాత నేను మస్కట్ వెళ్లిపోయా. ఎప్పుడైనా ఫోన్ చేసినా మా తమ్ముడే మాట్లాడేవాడు తప్ప విషిత ఇంట్లో ఉన్నా ఏనాడూ మాట్లాడలేదు. ఉదయ్ మరణం తర్వాత కూడా విషిత మాతో మాట్లాడలేదు. ఎందుకిలా జరిగిందో చెప్పలేదని’ ఉదయ్ అక్క శ్రీదేవి తన ఆవేదన పంచుకున్నారు. ఏది ఏమైనా వెండితెరపై వెలిగిపోవాల్సిన తార అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని మరీ నేలరాలిపోవడం అత్యంత విషాదాంశం.