Begin typing your search above and press return to search.

మాజీ యాంకర్.. ఫైవ్ స్టార్ పార్టీ

By:  Tupaki Desk   |   23 Aug 2017 8:24 AM GMT
మాజీ యాంకర్.. ఫైవ్ స్టార్ పార్టీ
X
ఒకప్పుడు తనదైన శైలిలో రియాలిటీ షోల్లో అలాగే సినిమాకు సంబందించి వేడుకలల్లో హోస్ట్ గా కనిపించిన ఉదయభాను వివాహం తర్వాత వాటన్నిటిని దూరం పెట్టేసింది. ఈ మధ్యనే ట్విన్స్ ఆడపిల్లలకు కు జన్మనిచ్చిన ఈ మాజీ యాంకర్ వారి బాగోగులను చూసుకుంటూ.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఎన్నో రోజులుగా సినిమా పరిశ్రమతో ప్రముఖులతో దూరంగా ఉన్న ఉదయభాను మళ్లీ వారందరిని కలుసుకుబోతోందట.

అది కూడా ఓ పెద్ద స్టార్ హోటల్ లో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి ప్రముఖులందరిని తన కుటుంబంతో కలవనుందట. ఇంతకీ ఏం పార్టీ అనుకుంటున్నారా?. తన కవల పిల్లలు అయిన భూమి ఆరాధ్య - యువి ఆరాధ్య మొదటి పుట్టిన రోజు వేడుకలను ఉదయభాను దంపతులు గ్రాండ్ గా బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్ లో నిర్వహించడానికి రెడీ అయిపోయారట.సెప్టెంబర్ 3న ఈ పార్టీ జరుగబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వేడుకకి కేవలం ఉదయభానుకు దగ్గరగా ఉన్న కొంత మంది స్టార్స్ మాత్రమే వస్తారట. అలాగే మీడియాల్లో ఆమెకు తెలిసిన వారిని కూడా ఇన్వైట్ చేయనుందని తెలుస్తోంది. ఇక ఆమెతో పాటు ఎదిగిన ప్రముఖ యాంకర్స్ ని కూడా ఉదయభాను పిలిచిందని తెలుస్తోంది. ఇక త్వరలోనే మళ్లీ ఉదయభాను తన గత జీవితాన్ని మళ్లీ బుల్లితెరపై ప్రదర్శించనుందని టాక్.