Begin typing your search above and press return to search.

సినిమాల్లోకి మరో పొలిటికల్ హీరో

By:  Tupaki Desk   |   19 Aug 2017 5:33 PM GMT
సినిమాల్లోకి మరో పొలిటికల్ హీరో
X
ప్రస్తుత రోజుల్లో సినిమాలకి రాజకీయాలకి చాలా దగ్గరి సంబందాలు ఏర్పడుతున్నాయనే చెప్పాలి. చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాలవైపు అడుగులు వేస్తుండగా.. మరి కొంతమంది రాజకీయ నాయకులు కుటుంబానికి చెందినవారు సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నాటకీయ రాజకీయాలంటే గుర్తొచ్చే తమిళనాడులో ఈ తరహా పద్ధతులు బాగా అమలవుతున్నాయని చెప్పాలి.

ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్‌ - దయానిధి మారన్‌ - అరుల్‌ నిధి వంటి పలువురు సినీ ప్రముఖుల జాబితాలో చేరారు. సినిమాలకు సంబంధించిన వ్యాపారాలు చేయడం.. సినిమాలు తీయడం.. నటించడం.. ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మరో అగ్ర రాజకీయ నాయకుడి కుటుంబ పేరు చేరబోతోంది. "పట్టాలి మక్కల్ కచ్చి" పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్ మనవడు గుణానిధి. ‘స్ర్టోక్‌ ఆఫ్‌ డిసోనెన్స్‌’ అనే 30 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ద్వారా మొదట సినీరంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంటున్న గుణానిధి త్వరలో భారీ చిత్రంతో కోలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. గుణనిధి మాట్లాడుతూ.. ఎలాగైనా తమిళ సినిమాలో నిలదొక్కుకోవాలని ఆసక్తితోనే మొదట లఘు చిత్రంతో ఆకట్టుకోనున్నట్లు తెలిపాడు. అదే విధంగా చిన్నతనం నుండి నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు చెబుతూ.. తన తాతయ్య చాలా సపోర్ట్ చేశారని గుణనిధి చెప్పాడు.

అలాగే 'స్ర్టోక్‌ ఆఫ్‌ డిసోనెన్స్‌’ షార్ట్ ఫిల్మ్ ను పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించినట్లు చెప్పారు చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు. శుక్రవారం ఈ షార్ట్‌ఫిలిం ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను చేతుల మీదుగా విడుదల చేశారు లఘు చిత్ర యూనిట్ సభ్యులు. త్వరలో సోషల్ మీడియా ద్వారా ఈ లఘు చిత్రాన్ని రిలీజ్ చేస్తారట.