Begin typing your search above and press return to search.
తన సినిమాను పిల్లలు.. గర్భిణులు చూడొద్దంటున్నాడు
By: Tupaki Desk | 23 Jan 2020 6:12 AM GMTతాను చేసే సినిమాను వీలైనంతవరకూ అందరూ చూడాలని చెప్పే హీరోల్ని చూస్తుంటాం. కానీ.. ఈ సినీ హీరో మాత్రం కాస్త భిన్నం. తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీని పిల్లలు.. గర్భిణులు అస్సలు చూడొద్దని చెప్పేస్తున్నాడు తమిళ యువ నటుడు ఉదయనిధి.
కరుణానిధి కుటుంబం నుంచి సినీ వారసత్వంగా అందిపుచ్చుకున్న నటుడిగా ఆయన్ను చెప్పాలి. సినిమాలతో పాటు.. రాజకీయాలపైనా తనదైన ముద్ర వేసేందుకు ఆయన తపిస్తున్నారు. ఇందుకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదిలిపెట్టటం లేదు. ఉదయ నిధి తాజాగా చేస్తున్న చిత్రం సైకో. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కంటిచూపు లేని పాత్రను పోషిస్తున్నాడు ఉదయ నిధి. ఈ తరహా పాత్రను పోషించటం ఇదే తొలిసారి.
ఒక సైకోకు.. తనకు మధ్య సాగే పోరాటమని.. సైకో పాత్రను కొత్త వ్యక్తి నటించినట్లు చెప్పారు. తాను నటిస్తున్న సైకో చిత్రం ప్రయోగాత్మకమని.. పిల్లలు చూసే సినిమా కాదని చెబుతున్నారు. గర్భిణులు కూడా ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిదిని చెబుతున్నారు.
సాధారణంగా తాము చేసే సినిమాల్ని అన్ని వర్గాల వారు చూడాలని కోరుకోవటం సహజం. అందుకు భిన్నంగా.. పిల్లలు.. గర్భిణులు చూడొద్దని చెప్పటమంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ ను మిస్ చేసుకున్నట్లే. ఉదయనిధి మాటలు విన్నంతనే.. కలెక్షన్ల కంటే కూడా కొన్ని సినిమాలు అలా చేశాయాలంతే అన్నట్లుగా ఉంటాయి. ఇలా చేసే దమ్ము టాలీవుడ్ లో ఏ హీరోకూ ఉండదేమో?