Begin typing your search above and press return to search.
కామెంట్ః 'పెద్దోళ్లు' తల దూర్చరేం?
By: Tupaki Desk | 10 Jun 2016 4:01 PM GMTఉడ్తా పంజాబ్ సెన్సారింగ్.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కుదిపేస్తున్న వివాదం. ఒక సినిమా విడుదలకు సెన్సార్ అడ్డుపడ్డం కంటే.. ఫిలిం సర్టిఫికేషన్ విభాగం అనుసరిస్తున్న తీరుపై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఉడ్తా పంజాబ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ చేస్తున్న పోరాటానికి బాలీవుడ్ జనాల నుంచి మద్దతు పెరుగుతోంది.
అనురాగ్ కు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న బాలీవుడ్ ప్రముఖులు రోజురోజుకూ పెరుగుతున్నారు. షాహిద్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్, రిచా ఛడ్డా.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. అయితే.. ఉడ్తా పంజాబ్ కు మద్దతు నిచ్చేందుకు ఇండస్ట్రీలో పెద్ద తలకాయలుగా ఉండే వారు వెనుకాడ్డం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఖాన్ త్రయంలో ఇప్పటివరకూ అమీర్ ఖాన్ ఒక్కడే నోరు మెదిపాడు, ఉడ్తాపంజాబ్ కు సపోర్ట్ ఇచ్చాడు. దేశంలో మత అసహనం అంటూ బాలీవుడ్ తరపున మొదటగా మాట్లాడిన షారూక్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ నోరు మెదపలేదు.
కేంద్రానికి సన్నిహితంగా మెలిగే అమితాబ్.. 'ఆలస్యం జరిగితే అది దురదృష్టకరం' అంటూ అంటీ ముట్టనట్లుగా చేసిన కామెంట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టాప్ రేంజ్ లో ఉన్న ప్రతీవారు వ్యక్తిగత, సినిమా అవసరాలను బేస్ చేసుకుని.. ఉడ్తాపంజాబ్ కు సపోర్ట్ ఇచ్చేందుకు భయపడుతున్నారని అనాల్సిందే. 'ఉడ్తా పంజాబ్ కు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తే అసహనం ఎందుకు రావడం లేదో? ఇదే సమస్య రేపు తమ సినిమాలకు తలెత్తుతుందని ఎందుకు అనిపించడం లేదో?' అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి వీటికి సమాధానం ఇచ్చే ధైర్యం వీరిలో ఎవరికైనా ఉందంటారా? అది కూడా లేనట్లేనా?