Begin typing your search above and press return to search.

ఆర్ఆర్‌ఆర్‌ : ఉక్రెయిన్‌ సాంగ్ చాలా స్పెషల్‌

By:  Tupaki Desk   |   12 Aug 2021 2:30 PM GMT
ఆర్ఆర్‌ఆర్‌ : ఉక్రెయిన్‌ సాంగ్ చాలా స్పెషల్‌
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఉక్రెయిన్‌ లో అత్యంత అద్బుతమైన లొకేషన్స్ లో జరుగుతుందట. సాదారణంగా జక్కన్న విదేశీ లొకేషన్స్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడు. అలాంటిది ఉక్రెయిన్‌ లో పాటల చిత్రీకరణకు వెళ్లాడు కనుక ఖచ్చితంగా ఆ పాటలు మరియు లొకేషన్స్‌ ఎంత ప్రత్యేకంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అద్బుతమైన లొకేషన్స్‌ లో ప్రస్తుతం రాజమౌళి చిత్రీకరిస్తున్న పాట సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. కీరవాణి స్వరపైర్చిన ఈ పాటలు జక్కన్న తనదైన శైలిలో అద్బుతమైన విజువల్ వండర్ గా చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న పాట గురించి యూనిట్‌ వర్గాల వారు చాలా హైప్ క్రియేట్‌ అయ్యేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమా నుండి రాబోతున్న తదుపరి సాంగ్‌ ఇదే అన్నట్లుగా కూడా వారు అనధికారికంగా చెబుతున్నారు. ఇద్దరు హీరోల కాంబోలో ఉండే సాంగ్‌ ను ప్రతి ఒక్కరు కన్నుల వింధుగా ఉందే అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకోవడమే లక్ష్యంగా రాబోతున్న ఆర్‌ ఆర్ ఆర్‌ సినిమా షూటింగ్‌ ను ఈ నెలలో పూర్తి చేసి అక్టోబర్ లో సినిమాను విడుదల చేస్తామని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

సినిమా ను అక్టోబర్‌ లో విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చు.. జనవరి 26న విడుదల చేస్తారేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలను ఆకాశానికి పెంచేలా చేస్తున్నాడు. అద్బుతమైన విజువల్‌ వండర్‌ గా బాహుబలి ని తెరకెక్కించిన రాజమౌళి మేకింగ్‌ లో వస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్‌ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నాయి. కనుక విజువల్ వండర్ గా మాత్రం ఆర్ ఆర్ ఆర్‌ ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.