Begin typing your search above and press return to search.

టాప్ లెస్ ఫోజులో ఉల్లాల్! కౌగిలిలో అత‌డెవ‌రు?

By:  Tupaki Desk   |   25 May 2021 4:34 AM GMT
టాప్ లెస్ ఫోజులో ఉల్లాల్! కౌగిలిలో అత‌డెవ‌రు?
X
స‌ల్మాన్ ‌భాయ్ `ల‌క్కీ` సినిమాతో స్నేహా ఉల్లాల్ ని తెర‌కు ప‌రిచ‌యం చేశారు. అచ్చు గుద్దిన‌ట్టు ఐశ్వ‌ర్యారాయ్ లా ఉంది అంటూ ప్ర‌చారం సాగింది. అయితే అదంతా కేవ‌లం పీఆర్ స్ట్రాట‌జీ అంటూ కొట్టి పారేసింది ఉల్లాల్. అదే త‌న‌కు వ‌రం .. అదే త‌న‌కు శాపంగానూ మారింది ఆ త‌ర్వాత‌. అయితే జూనియ‌ర్ ఐష్ గా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ‌ని సొంతం చేసుకుంది. కానీ ఆ క్రేజ్ ‌ని మాత్రం కంటిన్యూ చేయ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం న‌టిగా ఉల్లాల్ కి సినిమాలేవీ లేక‌పోవ‌డంతో డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. స్నేహ ఉల్లాల్ న‌టించిన వెబ్ సిరీస్ `ఎక్స్ పైరీ డేట్‌` ఇంత‌కుముందు స్ట్రీమింగ్ అయినా త‌న‌కు క‌లిసి రాలేదు.

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లో ప్ర‌వేశించిన ఉల్లాల్.. నేను మీకు తెలుసా- కరెంట్- వరుడు- సింహా- అలా మొదలైంది- మడతకాజా- యాక్షన్ త్రీడీ చిత్రాల్లో న‌టించింది. బ్లాక్ బ‌స్ట‌ర్లలో న‌టించినా త‌న‌కు స‌రైన గుర్తింపు రాలేదు. ఆ త‌ర్వాత త‌న‌కు వెన్ను నొప్పి ఉందని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన ఈ బ్యూటీకి 2014 నుంచి సినీఛాన్సుల్లేవ్.

అయితే ఉన్న‌ట్టుండి తాజాగా బ్యాక్ లెస్ ఫోజుతో ఒక్క‌సారిగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోని ఉల్లాల్ త‌న సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా.. ఇంత‌కీ అది ఉల్లాలేనా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది. ఆ ఫోటోలో శ‌రీరాకృతి విభిన్నంగా క‌నిపిస్తోంది. దీంతో సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. అయితే ఆ ఫోటో త‌న భ‌విష్య‌త్ ప్రాజెక్ట్ కి సంబంధించిన‌దా? ఏదైనా వెబ్ సిరీస్ లో న‌టిస్తున్న‌దా? అన్న‌దానికి క్లారిటీ లేదు. ఒక‌వేళ త‌న ఇన్ స్టా హ్యాక్ కి గురైందా? అనేది ఉల్లాల్ చెప్పాల్స ఉంది. అవి మిట్టల్ అనే ఫిలిం మేకర్ తో ప్రేమలో ఉన్నానని ఉల్లాల్ ఇంత‌కుముందు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. త‌న ప్ర‌యివేట్ లైఫ్ కి సంబంధించిన ఎలాంటి స‌మాచారం లేదు.