Begin typing your search above and press return to search.
`మా` అధ్యక్ష పదవిపై ఆయన కన్నేశారా?
By: Tupaki Desk | 18 April 2021 11:30 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలకు సమయమాసన్నమైనా ఇంకా దానిపై ఎలాంటి ప్రకటనా లేదు. 2019-21 సీజన్ ముగిసినా ఇప్పటివరకూ ఎన్నికలపై సినీపెద్దల నుంచి ఆదేశాలు రాలేదు. దీంతో మా ఎన్నికలు ఎప్పుడు? అంటూ ఆర్టిస్టుల్లో ఛాంబర్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రస్తుత సీజన్ కి సీనియర్ నరేష్ అధ్యక్షుడు కాగా అంతకుముందు శివాజీ రాజా అధ్యక్షుడిగా కొనసాగారు. కానీ ఈసారి మరో కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రచారం సాగుతోంది. శివాజీరాజా వర్సెస్ నరేష్ ఎపిసోడ్స్ ఆర్టిస్టుల సంఘం పరువు మర్యాదలకు భంగం కలిగించడమేగాక కార్యకలాపాలు నిలిచిపోవడానికి కారణమైంది. అందుకే ఇక ఆ ఇద్దరికీ ఛాన్స్ ఉండదన్న చర్చా సాగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆయనే ప్రకాష్ రాజ్.
సినీఇండస్ట్రీలో ఎంతో కీలకమైన ఆ పదవి దక్కాలంటే మెగా అండదండలు తప్పనిసరి అన్నది అందరికీ తెలిసిన విషయమే. గత ఇద్దరు అధ్యక్షులు మెగా కాంపౌండ్ అండదండలతోనే పదవులు చేపట్టారు. కానీ ఆ ఇద్దరి పేర్లు వివాదాల్లో నలగడం ఇబ్బందికరంగా మారింది. అందుకే ఈసారి అధ్యక్షుడిని ఎంపిక చేసే విధానం ఎలా ఉంటుందన్న చర్చా సాగుతోంది. కచ్ఛితంగా మెగాస్టార్ సారథ్యంలో ఏకగ్రీవంగా అధ్యక్షుడి ఎంపిక ఉండే ఛాన్సుందని కూడా టాక్ వినిపిస్తోంది. అందుకే కొంత కాలంగా ప్రకాష్ రాజ్ మెగా కాంపౌండ్ ని దువ్వుతున్నాడని.. ఇటీవల పొగడ్తలు అందులో భాగమేనని గుసగుస వినిపిస్తోంది. అయితే ఇది నిజమా? ప్రకాష్ రాజ్ కి నిజంగానే అధ్యక్ష పదవిపై ఆసక్తి ఉందా? ఒకవేళ ఉన్నా.. ఆయనను అధ్యక్షుడిని చేసేందుకు మెగా కాంపౌండ్ సిద్ధంగా ఉందా? వివాదాలు అవసరం లేని `మా` కు మరో వివాదాస్పదుడినే ఎన్నుకుంటారా? అంటూ రకరకాలుగా చర్చ సాగుతోంది. ఇందులో నిజం ఎంతో ప్రకాష్ రాజ్ స్వయంగా స్పందిస్తారేమో చూడాలి.