Begin typing your search above and press return to search.
'పుష్ప'లో పోకిరి తరహా ట్విస్ట్ ఉండనుందా?
By: Tupaki Desk | 24 July 2020 1:30 PM GMTమహేష్ బాబు హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ చిత్రంలోని ట్విస్ట్ ను మరపించే ట్విస్ట్ అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో లేదనే చెప్పాలి. కాని అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ట్విస్ట్ అదిరి పోతుందని క్లైమాక్స్ లో ఉండే ఈ ట్విస్ట్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందంటున్నారు. ఆ ట్విస్ట్ ఏంటీ అనేది చిత్ర యూనిట్ సభ్యులకు కూడా తెలియకుండా మ్యానేజ్ చేస్తున్నారట. ఆ ట్విస్ట్ సినిమా విడుదలయ్యే వరకు రివీల్ చేయవద్దని భావిస్తున్నారట.
అల్లు అర్జున్ సినిమాలో ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు. ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేసి దుంగలను లారీలో వేసుకు వెళ్లే లారీ డ్రైవర్ పాత్రను అల్లు అర్జున్ చేస్తున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ లుక్ లో కూడా అదే విషయాన్ని నిర్థారించారు. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటీ అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. బన్నీ పాత్రకు సంబంధించి ఆ ట్విస్ట్ ఉంటుందా లేదంటే కథలో మరేదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది చూడాలి.
అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు విలన్ గా కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కేరళలో మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా షూటింగ్ ను ఇంకా మొదలు పెట్టలేదు. అక్టోబర్ లేదా నవంబర్ లో షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో చివరి సినిమాను విడుదల చేయవచ్చు అంటున్నారు.