Begin typing your search above and press return to search.
వాయిదా లేదు.. అవన్నీ రూమర్స్
By: Tupaki Desk | 21 Dec 2018 6:38 AM GMTమనోభావాలు దెబ్బ తినడం అంటూ ఇటీవల సినిమాల రిలీజ్ లను ఆపేయడం ఒక ఫ్యాషన్ అయ్యింది. కులం - మతం - వర్గం - జాతి .. పేరుతో అవమానించారంటూ సినీఇండస్ట్రీకి తూట్లు పొడుతున్నారు. కోట్లాది రూపాయలు రిస్క్ చేసి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు రిలీజ్ ముంగిట ప్రాణ సంకటం తప్పడం లేదు. నేడు రిలీజయిన కె.జి.ఎఫ్ చిత్రానికి అలాంటి సంకటం తప్పలేదు. ఈ సినిమాని ఏకంగా ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ ప్లాన్ చేశారు. కేవలం కేరళలో 400 థియేటర్లలో - వరల్డ్ వైడ్ ఏకంగా 1500 థియేటర్లలో రిలీజ్ కి సిద్ధం చేశారు.
సరిగ్గా రిలీజ్ కి ఒకరోజు ముందు ఈ సినిమాపై కోర్టులో పిటిషన్ వేశారని - దాంతో రిలీజ్ వాయిదా పడిందని ప్రచారం సాగింది. ఈ చిత్రంలో కోలార్ బొగ్గు గనుల ఇమేజ్ కి డ్యామేజ్ కలిగిస్తూ కె.జి.ఎఫ్ టీమ్ ప్రచారం సాగిస్తోందని - సినిమా రిలీజ్ ని ఆపేయాలని యోగేష్ - రతన్ అనే ఇద్దరు కోర్టులో కేసు వేశారట. `రౌడీ తంగమ్` అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తీశారని - దాని హక్కులు తమ వద్ద ఉన్నాయని పిటిషన్ వేశారన్న ప్రచారం సాగింది. అలాగే ఆర్య ఫిలింస్ లక్ష్మీ నారాయణ అనే అతడు చిత్ర నిర్మాతలపై కేసు వేసేందుకు ప్రయత్నించారని - బెంగళూరు మెట్రోపాలిటన్ కోర్టులో దీనిపై తీర్పు వెలువడనుందని అన్నారు.
అయితే ఆ ప్రచారం సాగిన కొద్ది గంటల్లోనే దానిని ఖండిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజవుతోందని తెలుగు వెర్షన్ కె.జి.ఎఫ్ పీఆర్ వో అధికారికంగా ప్రకటించారు. ఎలాంటి చిక్కులు లేకుండా సినిమా రిలీజవుతోందని తేల్చి చెప్పారు. నేడు సినిమా రిలీజైంది. ఇప్పటికే అంతర్జాలంలోకి సమీక్షలు వచ్చేశాయి. అమెరికా నుంచి వేకువ ఝాము కె.జి.ఎఫ్ రిపోర్టులు అందాయి. కోలార్ బంగారు గనుల్లో మాఫియాపై తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రంలో యశ్ నటన ఆకట్టుకుందని సమీక్షకులు తెలిపారు. మొత్తానికి బంగారు గనుల ఇమేజ్‌కి డ్యామేజీ జరగలేదు.. కాబట్టి ఇబ్బంది లేకుండానే రిలీజైందని భావించాల్సి ఉంటుందేమో?