Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: చిరుతో చరణ్ మళ్లీ మళ్లీ..!
By: Tupaki Desk | 17 Sep 2021 5:30 AM GMTమెగాభిమానులకు వరుసగా బిగ్ బొనాంజ ట్రీట్ ముందుంది. రానున్నది అంతా మెగా మిషన్ టైమ్. చిరంజీవి -రామ్ చరణ్ కాంబో నుంచి ఊహించని వరుస ట్రీట్ కి ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాల్సిందే. కొరటాలతో ఆచార్యలో చిరు-చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిరు - చరణ్ ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను ముగించారు. సంక్రాంతి కానుకగా ఆచార్య విడుదల కానుంది. ఈలోగానే మరోసారి చిరు-చరణ్ పై షూట్ అంటూ న్యూస్ అందింది.
ప్రస్తుతం కొరటాల శివ తండ్రీకొడుకులు చిరు-చరణ్ పై ఒక విలాసవంతమైన పాటను తెరకెక్కించనున్నారు. వచ్చే వారం పాటల చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఇందుకోసం భారీ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిరస్మరణీయ పాట కాకుండా చరణ్- పూజా హెగ్డే జంటపైనా మరో పాట ఈ నెలాఖరులో చిత్రీకరిస్తారు. ఆచార్య మొత్తం షూటింగ్ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తవుతుంది. సినిమా విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరో కథానాయిక. మణిశర్మ సంగీతం అందించనున్నారు.
2021 -22 మెగా సీజన్ బ్యాక్ టు బ్యాక్ ట్రీట్
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఖైదీనంబర్ 150 - సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రాల్లో నటించి బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించారు. ఇప్పుడు `ఆచార్య` చిత్రంలోనూ ఆయన పాత్ర ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. తదుపరి నలుగురు దర్శకులను ఫైనల్ చేసి వెంట వెంటనే సినిమాల్ని ప్రారంభించారు. ఆ నలుగురు సీనియర్ దర్శకులు కాగా... మరో నలుగురు యువదర్శకుల స్క్రిప్టుల్ని కూడా చిరు వింటున్నారని కథనాలొచ్చాయి. తదుపరి మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ `గాడ్ ఫాదర్` తెరకెక్కుతోంది. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వేదాళం రీమేక్ టైటిల్ గా `భోళా శంకర్`ని ప్రకటించారు. భోళా శంకర్ టైటిల్ కి తగ్గట్టే మెగాస్టార్ నుంచి గొప్ప వినోదాన్ని అందించనున్నారు.అలాగే మెహర్ కంటే ముందే బాబీతో సినిమా చిత్రీకరణకు వెళ్లాల్సి ఉంటుందిట. కానీ దర్శకుడు బాబి తెరకెక్కించే సినిమాకి టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది.
తదుపరి దర్శకుడు మారుతితోనూ మెగాస్టార్ ఓ సినిమా చేస్తారని తెలిసింది.
ఇకపోతే రామ్ చరణ్ ఆచార్య తర్వాత ఆర్.సి 15 చిత్రీకరణతో బిజీ అయ్యారు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో అత్యంత భారీ కాన్వాసుపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2022లో ఈ సినిమా విడుదలవుతుంది. అంతకుముందే చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ ఇద్దరి నుంచి బ్యాక్ టు బ్యాక్ ట్రీట్ మెగాభిమానులకు పసందును పంచనుంది.
RC15 జాతీయ స్థాయిలో..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో RC15 ఇటీవలే హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. లాంచింగ్ డే పోస్టర్ లో ఆర్సీ 15లో నటిస్తున్న కొందరు ముఖ్య తారాగణం సిబ్బంది వివరాల్ని అందించారు. ఇది పాన్ ఇండియా కేటగిరీ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కూడా సూట్ ధరించి చరణ్ -శంకర్ - కియరాలతో పాటు ఈ పోస్టర్ లో ఎంతో స్టైలిష్ గా కనపబడడం ఆశ్చర్యపరిచింది. పోస్టర్ లో నటులు రామ్ చరణ్- కియారా అద్వానీ- జయరామ్- సునీల్- అంజలి- నవీన్ చంద్ర ఉన్నారు. దర్శకుడు శంకర్- నిర్మాత దిల్ రాజు- సినిమాటోగ్రాఫర్ ఎస్ తిరునావుక్కరసు- మ్యూజిక్ కంపోజర్ ఎస్ థమన్ ఇతరులతో చిత్రబృందాన్ని ప్రకటించారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణను శంకర్ బృందం ప్రారంభించనుంది.