Begin typing your search above and press return to search.
యంగ్ హీరో సినిమాకు ఊహించని ట్విస్ట్!
By: Tupaki Desk | 9 Oct 2022 1:30 AM GMTదసరా అనగానే భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుంటాయి అన్నది తెలిసిందే. ప్రతీ సీజన్ లాగే ఈ దసరా సీజన్ లోనూ భారీ సినిమాలు బరిలోకి దిగాయి. మెగాస్టార్ చిరంజీవి నటించి `గాడ్ ఫాదర్`, కింగ్ నాగార్జున నటించిన `ది ఘోస్ట్` సినిమాలు అక్టోబర్ 5న విడుదలయ్యాయి. ఇదే సమయంలో చిన్న సినిమా కూడా ఈ ఇద్దరు సీనియర్ స్టార్ ల మధ్య పోటీటి దిగింది. అదే బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన `స్వాతిముత్యం`.
దసరా రేసులో పెద్ద సినిమాలు వున్నా.. వాటి మధ్య లో చిన్న హీరో సినిమా నలిగిపోవడం ఖాయం అని కామెంట్ లు వినిపించినా ఇదే సరైన సమయం అని మేకర్స్ డేర్ గా `స్వాతిముత్యం`ని థియేటర్లలోకి వదిలారు. రెండు పెద్ద సినిమాలు సందడి చేస్తున్నా చిన్న సినిమాగా విడుదలైన `స్వాతిముత్యం` చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనరన్ అనిపించుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో కే మంచి టాక్ ని సొంతం చేసుకుని హిట్ అనిపించుకుంది.
కంటెంట్ ని నమ్ముకుని సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ధైర్యంగా రిలీజ్ చేసిన ఈ మూవీ తొలి షో నుంచే మంచి టాక్ ని దక్కించుకుని హిట్ సినిమాగా నిలిచింది. దసరాకు విడుదలైన సినిమాల్లో ది బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన `స్వాతిముత్యం` నిర్మాత సూర్యదేవరనాగవంశీ చెప్పినట్టుగానే దసరా సీజన్ కి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. ఈ సినిమాతో పాటు విడుదలైన సీనియర్ హీరోల సినిమాల్లో కింగ్ నాగ్ `ది ఘోస్ట్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.
ఇక మలయాళ రీమేక్ `లూసీఫర్` ఆధారవంగా మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన `గాడ్ ఫాదర్` ఫరవాలేదనిపించింది. ఈ రెండు సినిమాలకు మించి దసరా విన్నర్ గా `స్వాతిముత్యం` నిలిచింది. అయితే ఈ సినిమా విజయంతో ఆనందంలో వున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ కి ఈ మూవీ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫెస్టివెల్ కి బెస్ట్ మూవీగా నిలిచిన `స్వాతిముత్యం` టాక్ కు అనుగుణంగా మాత్రం వసూళ్లుని రాబట్టలేక ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది.
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి వసూళ్లు అంతంత మాత్రంగానే వున్నాయి. టాక్ సూపర్ హిట్ అంటుంటే వసూళ్లు మాత్రం షాకిస్తున్నాయి. మల్టీప్లెక్స్ ఫరవాలేదనిపిస్తే సింగిల్ స్క్రీన్ ల పరిస్థితి మరీ దారుణంగా వుంది. రివ్యూలు బాగున్నా కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఇప్పటికీ ఈ మూవీ వసూళ్ల ఊసే ఎత్తకపోవడం పరిస్థితి అద్దంపడుతోంది. `స్వాతిముత్యం` సోలోగా రిలీజ్ అయితే వసూళ్ల పరిస్థి వేరేగా వుండేదని, అంతే కాకుండా పేరున్న నటుడు వుంటే మరింతగా ఈ మూవీకి ప్లస్ అయ్యేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.