Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ లైఫ్ లో ఊహించ‌ని ట్విస్టులు!

By:  Tupaki Desk   |   22 Dec 2022 2:30 AM GMT
స్టార్ హీరోయిన్ లైఫ్ లో ఊహించ‌ని ట్విస్టులు!
X
ఇటీవ‌లే వ్య‌క్తిగ‌త జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్న‌ టాలీవుడ్ అగ్ర క‌థానాయిక స‌మంత‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టించేందుకు సంత‌కాలు చేసినా అనూహ్య ప‌రిణామాల‌ను ఎదుర్కొంటున్నారు. ఇటీవ‌ల సామ్ అనారోగ్య కార‌ణాల‌తో షూటింగులు వాయిదా ప‌డటం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న సమంత దానికి చికిత్స తీసుకునేందుకు విదేశాల‌కు వెళ్లార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇదంతా ఇలా ఉండ‌గానే సామ్ ఆరోగ్యం పూర్తిగా మెరుగ‌వ్వ‌లేదని.... అందుకే ఇంకా త‌దుప‌రి సినిమాల సెట్స్ పైకి వెళ్ల‌డం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌లోనే స‌మంత సోష‌ల్ మీడియాల్లో తాను ఆరోగ్యంగానే ఉన్నాను అని నిరూపించే కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. స‌మంత ఈ ఫోటోల్లో కొంత కొంటెత‌నాన్ని ప్ర‌ద‌ర్శించ‌డాన్ని చూస్తుంటే త‌ను కోలుకుంద‌నే భావిస్తున్నారు.

త్వ‌ర‌లోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `ఖుషీ` మూవీ చిత్రీక‌ర‌ణ‌కు ఎటెండ‌వుతుంద‌ని కూడా భావిస్తున్నారు. కానీ ఇంత‌లోనే మ‌రో ఊహించ‌ని ట్విస్టు షాకిస్తోంది. స‌మంత త‌దుప‌రి ఫ్యామిలీమ్యాన్ సృష్టిక‌ర్త‌లు రాజ్ అండ్ డీకే సార‌థ్యంలోని క్రేజీ వెబ్ సిరీస్ లో న‌టించాల్సి ఉండ‌గా.. ఈ ప్రాజెక్టు నుంచి సామ్ నిష్కృమించాల్సి వ‌చ్చింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. దానికి కార‌ణం తాజాగా అమెజాన్ రివీల్ చేసిన ఓ పోస్ట‌ర్ లో వ‌రుణ్ ధావ‌న్ స‌హా సాంకేతిక నిపుణుల వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి కానీ ఎక్క‌డా స‌మంత ప్ర‌స్థావ‌నే తేలేదు. దీంతో స‌మంత ఈ క్రేజీ సిరీస్ నుంచి ఎగ్జిట్ అయ్యిందా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌స్తుతం మ‌యోసైటిస్ ఇబ్బందికి గురి చేయ‌డంతో తానే స్వ‌చ్ఛందంగా ఈ సిరీస్ నుంచి త‌ప్పుకుంద‌ని కూడా అభిమానుల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ రాజ్ అండ్ డీకే లాంటి ట్యాలెంటెడ్ ఫిలింమేక‌ర్స్ వ‌ల్ల‌నే స‌మంత‌కు పాన్ ఇండియా క్రేజ్ ద‌క్కింద‌నేది కాద‌న‌లేని నిజం. ఫ్యామిలీమ్యాన్ 2 లో ఎల్.టి.టి.ఇ తీవ్ర‌వాది రాజీ పాత్ర‌లో అవ‌కాశం ఇచ్చి స‌మంత మైలేజ్ ని అమాంతం పెంచారు ఈ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ద్వ‌యం. త‌దుప‌రి వెంట‌నే వారితో క‌లిసి స‌మంత సిరీస్ ని ప్ర‌క‌టించ‌గానే ఉత్కంఠ క‌లిగింది. కానీ ఇంత‌లోనే అనారోగ్యం త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌డం .. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ విడుద‌ల చేసిన తాజా పోస్ట‌ర్ లో స‌మంత కు సంబంధించి అప్ డేట్ లేక‌పోవ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తోంది. సిటాడెల్ ఇండియా వెర్ష‌న్ కోసం వ‌రుణ్ ధావ‌న్- స‌మంత జంట‌ను రాజ్ అండ్ డీకే ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సిరీస్ లో స‌మంత న‌టిస్తుందా లేదా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

జనవరి 2023 నుండి సిటాడెల్ షూటింగ్ ప్రారంభమవుతుందని ట్వీట్ చేసిన రాజ్ అండ్ డీకే.. ఇతర సాంకేతిక నిపుణుల‌కు ట్యాగ్ చేసినప్పటికీ షో సహచరులు ఎక్కడా సమంతను అధికారికంగా ట్యాగ్ చేయక‌పోవ‌డం సందేహాల‌కు కార‌ణ‌మైంది. ఒక‌వేళ స‌మంత ఎగ్జిట్ అయితే ఆ స్థానంలో కొత్త హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది. దేవ‌ర‌కొండ‌తో ఖుషీ ప్రారంభ‌మ‌వుతుంద‌ని క‌థ‌నాలొస్తున్నా క‌చ్ఛిత‌మైన తేదీ ఇంకా తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.