Begin typing your search above and press return to search.
100% ఆక్యుపెన్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరిన కేంద్ర హోంశాఖ..!
By: Tupaki Desk | 6 Jan 2021 2:37 PM GMTతమిళనాడు ప్రభుత్వం థియేటర్స్ లో 100 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సులలో ఇప్పటివరకూ ఉన్న 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను తొలిగిస్తూ.. 100 శాతానికి పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు ప్రదర్శించుకోవాలని అందులో పేర్కొంది. అయితే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. థియేటర్లలో 100% ఆక్యుపెన్సీని అనుమతించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కేంద్ర గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. దీంతో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా, తమిళనాడు ప్రభుత్వం 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్స్ నడుపుకోవచ్చని జీవో జారీ చేయడంతో థియేటర్ ఓనర్స్ - ఎగ్జిబిటర్స్ - ప్రొడ్యూసర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే దీని వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ వంద శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. దీంతో ఇప్పుడు మళ్లీ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల సీటింగ్ కెపాసిటీ పెంచాలని కోరుతూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.