Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ కొర‌త‌పై కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీ వ్యాఖ్య‌లు.. ఇరుకున ప‌డ్డ బీజేపీ!

By:  Tupaki Desk   |   19 May 2021 3:44 PM GMT
వ్యాక్సిన్ కొర‌త‌పై కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీ వ్యాఖ్య‌లు.. ఇరుకున ప‌డ్డ బీజేపీ!
X
దేశంలో వ్యాక్సిన్ల కొర‌త వేధిస్తోంద‌ని ప‌లు రాష్ట్రాలు చెబుతున్న విష‌యం తెలిసిందే. తెలంగాణ వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ అందుబాటులో లేక వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌నే నిలిపేశాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్ర ప్ర‌భుత్వం డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టేలా కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు స‌మాచారం.

దేశంలో అవ‌స‌రానికి త‌గిన‌ట్టుగా వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి కావ‌ట్లేద‌ని, వెంట‌నే మ‌రో ప‌ది కంపెనీల‌కు త‌యారీ అనుమ‌తులు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ‌డ్క‌రీ అన్న‌ట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం ప‌లు యూనివ‌ర్సిటీల వీసీల‌తో నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం దేశంలో రెండు కంపెనీలు మాత్ర‌మే వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. వ్యాక్సిన్ పై పేటెంట్ ఉన్న‌వారికి ప‌ది శాతం రాయ‌ల్టీ చెల్లించైనా కొత్త‌గా ప‌ది కంపెనీల‌కు త‌యారీ లైసెన్సులు ఇచ్చి, వ్యాక్సిన్ ఉత్ప‌త్తి పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ‌డ్క‌రీ వ్యాఖ్యానించిన‌ట్టుగా తెలుస్తోంది.

అంతేకాకుండా.. మోదీపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌న దేశంలో త‌యారైన వ్యాక్సిన్ల‌ను ముందుగా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన త‌ర్వాత మిగిలితేనే ఇత‌ర దేశాల‌కు అందించాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. మెడిక‌ల్ ఆక్సీజ‌న్ కొర‌త‌ను అధిగ‌మించాల‌న్న మంత్రి.. ఇప్ప‌టికీ వ్యాక్సిన్ల ముడి స‌రుకు కోసం దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డాల్సి రావ‌డం శోచ‌నీయమ‌ని కూడా వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

ఇదిలాఉండ‌గా.. టీకాల ఉత్ప‌త్తిని పెంచేందుకు కేంద్రం ఇత‌ర కంపెనీల‌కు అనుమ‌తులు ఇచ్చిందంటూ.. మంగ‌ళ‌వారం నాటి వీసీల స‌మావేశంలోనే మ‌రో కేంద్ర మంత్రి మ‌న్ సుఖ్ మాల‌వియా ప్ర‌క‌టించిన‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత గ‌డ్క‌రీ ఆయ‌న సూచ‌న‌లు చేశారు.

ఈ విష‌య‌మై తాజాగా స్పందించిన గ‌డ్క‌రీ.. టీకాల ఉత్ప‌త్తికి కేంద్రం చేస్తున్న కృషి గురించి త‌న‌కు తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే.. తాను మ‌రోసారి టీకా ఉత్ప‌త్తి గురించి సూచ‌న‌లు చేశాన‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ఒక కేంద్ర మంత్రి.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు తెలియ‌ద‌ని చెప్ప‌డం ప‌ట్ల విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.