Begin typing your search above and press return to search.

యూనివ‌ర్స‌ల్ స్టార్ లైన‌ప్ మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   26 Nov 2022 3:30 AM GMT
యూనివ‌ర్స‌ల్ స్టార్ లైన‌ప్ మామూలుగా లేదుగా!
X
ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు, యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ క్రిమ‌యాశీల రాజ‌కీయాల కార‌ణంగా దాదాపు మూడున్న‌రేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. ఇక అంత‌కు ముందు వ‌ర‌కు చేసిన సినిమాలేవీ క‌మ‌ల్ కు ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయాయి. దీంతో ప‌వ‌ర్ ఫుల్ కంబ్యాక్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌తో త‌ను న‌టించిన `విక్ర‌మ్‌` కు సీక్వెల్ గా చేసిన యాక్ష‌న్ క్రైమ్‌ డ్రామా `విక్ర‌మ్‌`. లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఊహించ‌ని విధంగా క‌మ‌ల్ కెరీర్ లోనూ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించింది. అ మూవీతో ఊహించ‌ని విధంగా బౌన్స్ బ్యాక్ అయిన క‌మ‌ల్ ప్ర‌స్తుతం ఈ మూవీ అందించ‌న జోష్ తో శంక‌ర్ మధ్య‌లో ఆపేసిన `ఇండియ‌న్ 2`ని మ‌ళ్లీ మొద‌లు పెట్టారు. రీసెంట్ గా షూటింగ్ విరామం లభించ‌డంతో ద‌ర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్‌ని ఆత్మీయంగా ప‌ల‌క‌రించ‌డం కోసం హైద‌రాబాద్ వ‌చ్చి వెళ్లిన క‌మ‌ల్ ఉన్న‌ట్టుండి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్న క‌మ‌ల్ మ‌రో రెండు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నారు.

ఆ త‌రువాత కొంత విశ్రాంతి తీసుకుని మ‌ళ్లీ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న `ఇండియ‌న్ 2` షూట్ లో పాల్గొంటార‌ట‌. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత క‌మ‌ల్ బ్యాక్ టు బ్యాక్ భారీ లైన‌ప్ ని లైన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. `ఇండియ‌న్ 2` త‌రువాత బ్లాక్ బ‌స్ట‌ర్ `విక్ర‌మ్‌`కు సీక్వెల్ ని లోకేష్ క‌న‌గ‌రాజ్ తో మొద‌లు పెడ‌తాడ‌ట‌. లోకేష్ క‌న‌గ‌రాజ్ త్వ‌ర‌లో విజ‌య్ 67ని ప్రారంభించ‌బోతున్నాడు. దీని త‌రువాతే `విక్ర‌మ్‌` సీక్వెల్ ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా క‌మ‌ల్ త‌న బంధువు.. అల్లుడు అయిన‌టు వంటి మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్ లో ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్ట్ ల‌తో పాటు సంతోష్ నారాయ‌ణ‌న్‌, ఖాకీ, నేర్కొండ పార్వై, వ‌లిమై, తునీవు చిత్రాల ఫేమ్ హెచ్ వినోద్ డైరెక్ష‌న్ లోనూ ఓ మూవీ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ ప్రాజెక్ట్ ల‌ని వ‌చ్చే ఏడాది అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.