Begin typing your search above and press return to search.
లైవ్ లో శ్రీరెడ్డి గుట్టు విప్పేసిన గాయత్రి
By: Tupaki Desk | 18 April 2018 1:55 PM GMTశ్రీరెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టడంతో అడ్డం తిరిగిన వ్యవహారం మరింత ప్రతికూలంగా మారింది. తాజాగా ఒక టీవీ ఛానెల్ చర్చలో నటి గాయత్రి గుప్తా.. శ్రీరెడ్డిని బాగా ఇబ్బంది పెట్టేసింది. ఏడాది కిందట శ్రీరెడ్డికి తనకు మధ్య జరిగిన సంభాషణను ఆమె బయట పెట్టింది. ఒకప్పుడు తాను.. శ్రీరెడ్డి సాక్షి టీవీ ఛానెల్లో కలిసి పని చేశామని.. ఐతే అక్కడ ఆమె ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండేదని.. శ్రీరెడ్డి మీద సెడక్ట్రెస్ అనే ఒపీనియర్ ఆ మీడియా సంస్థలో పని చేస్తున్నప్పటి నుండి ఉందని.. అందుకే ఆమెను ఆ ఛానెల్ నుంచి బయటికి పంపించేశారని గాయత్రి చెప్పింది.
ఆ తర్వాత శ్రీరెడ్డితో తాను టచ్ లో లేనని.. ఐతే గత ఏడాది అనుకోకుండా ఇద్దరం కలిసినపుడు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నామని గాయత్రి వెల్లడించింది. ఆ తర్వాత శ్రీరెడ్డి తనకు ఫోన్ చేసి ‘నా దగ్గర అభి ఫోటోస్ ఉన్నాయి. వి కెన్ ప్లే విత్ హిమ్, ఇద్దరం కలిస్తే చాలా ఆడుకోవచ్చు’ అని చెప్పిందని గాయత్రి వెల్లడించింది. ఈ విషయం నిజమా కాదా అడగండి అంటూ శ్రీరెడ్డి వైపు చూపించింది గాయత్రి.
దీంతో శ్రీరెడ్డి ఏడ్చేసింది. తానును పోరాటం చేసి చేసి అలిసిపోయానని... ఈ పోరాటంలో ఓడిపోయానని.. వీటిని ఎదుర్కోవడం తన వల్ల కాదని... తనను పర్సనల్ గా ఇంత టార్గెట్ చేస్తారని అనుకోలేదని శ్రీరెడ్డి అంది. ఒక ఆడ పిల్లగా ఇది తట్టుకోలేనని.. తాను జీవితంలో తప్పులు చేశానని ఒప్పుకుంటున్నానని.. అభిరామ్ ఫోటోలు తన వద్ద ఉన్నాయని గాయత్రికి చెప్పలేదని.. ఇండస్ట్రీలో అలా జరుగుతున్నపుడు ప్లే చేయడంలో తప్పేముందని అంటూ శ్రీరెడ్డి బోరుమని ఏడ్చేసింది.