Begin typing your search above and press return to search.
నాని గుండెలు పిండేసేలా ఉన్నాడే..
By: Tupaki Desk | 15 Jun 2017 10:21 AM GMTనేచురల్ స్టార్ నాని గత రెండేళ్లలో తిరుగులేని ఎంటర్టైనర్ గా ఎదిగాడు. 2015లో ‘భలే భలే మగాడివోయ్’ - గత ఏడాది ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’.. ఈ సంవత్సరం ‘నేను లోకల్’ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. మధ్య మధ్యలో కొంచెం డిఫరెంట్ జానర్స్ ట్రై చేసినప్పటికీ వాటితో పోలిస్తే ఎంటర్టైనర్లే ఎక్కువగా మెప్పించాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. ఐతే నాని ఈసారి తనకు అచ్చొచ్చిన జానర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లుగా అనిపించడం లేదు. ‘నిన్ను కోరి’ సీరియస్.. ఇంటెన్స్ లవ్ స్టోరీలాగా కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా బయటికొచ్చిన రెండు పాటలూ ఆ ఫీలింగే కలిగిస్తున్నాయి.
‘నిన్ను కోరి’ నుంచి మొదటగా రిలీజ్ చేసిన ‘అడిగా అడిగా..’ పాట వింటే గాఢమైన ప్రేమ భావనలు కలగడం ఖాయం. అదే సమయంలో ఇదేదో బ్రేకప్ సాంగ్ మాదిరిగా అనిపించింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ లవ్ సాంగ్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. తాజాగా ‘నిన్ను కోరి’ నుంచి ‘ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే..’ అంటూ మరో పాట లాంచ్ చేశారు. అది కూడా ఆహ్లాదకరమైన ప్రేమ పాటే. ఐతే ఇది డ్యూయెట్ స్టయిల్లో సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కార్తీక్, చిన్మయి చాలా శ్రావ్యంగా ఆలపించారు. ఈ పాట విన్నా కూడా మంచి లవ్ ఫీల్ కలుగుతుంది. ఈ రెండు పాటలూ కూడా సినిమా ఇంటెన్స్ లవ్ స్టోరీ అన్న ఫీలింగ్ కలిగిస్తున్నాయి. ఈ మధ్యే విడుదలైన ‘నిన్ను కోరి’ టీజర్ కూడా ఇదే కోవలో ఉంది. మరి నాని ఎంటర్టైన్మెంట్ వదిలేసి.. ప్రేమలో ముంచెత్తుతా అంటే ప్రేక్షకులు ఏమేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/