Begin typing your search above and press return to search.
ఓ బేబీ పోస్టర్ పై అనవసరంగా విమర్శలు!
By: Tupaki Desk | 27 May 2019 5:29 AM GMTమన నెటిజనులు మరీ కఠోర హృదయులు. ఎవరైనా దర్శకుడు జస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే చాలు అది ఇట్టే పట్టేస్తారు. వెంటనే అందరికీ చెప్పేసి సదరు ఫిలిం మేకర్ల గాలి తీసేస్తారు. ఇక సీన్లు కాపీ కొట్టినా అంతే.. పోస్టర్లు కాపీ కొట్టినా అంతే. వీరికి ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని తేడా ఉండదు.. సామాజిక న్యాయం ఫుల్ గా పాటిస్తారు. కానీ ఈసారి మాత్రం నెటిజనులు నందిని రెడ్డి విషయంలో మాత్రం చేసేది పొరపాటేనని కొందరు ఉదారంగా ఉండే సినీ అభిమానులు అంటున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే నందిని రెడ్డి ప్రస్తుతం సమంతా ప్రధాన పాత్రలో 'ఓ బేబీ' అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా కొరియా భాషలో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'మిస్ గ్రానీ' కి రీమేకు. అసలే నందిని రెడ్డి ఆ సినిమా నుంచి.. ఈ సినిమా నుంచి ప్రేరణ తీసుకుంటుందని.. ఒక్కోసారి వారికి క్రెడిట్ ఇవ్వదని కూడా కాస్త చెడ్డపేరుంది. గతంలో 'జబర్దస్త్' సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అది బాలీవుడ్ సినిమా 'బ్యాండ్ బాజా బారాత్' కు మక్కికి మక్కిగా దించేసిందని తెలిసిపోయింది. విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు అఫీషియల్ రీమేక్ కావడం తో ఆమె క్రియేటివిటీకి పదును పెట్టాల్సిన అవసరమే లేకుండా పోయింది.
రీసెంట్ గా 'ఓ బేబీ' ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. జనాలకు నచ్చింది. సామ్ ఫ్యాన్స్ అయితే తెగ థ్రిల్ అయ్యారు. అయితే ఈ ఫస్ట్ లుక్ కు 'మిస్ గ్రానీ' సినిమా పోస్టర్ కు మహా అయితే ఓ పది శాతం మాత్రమే తేడా ఉంటుంది. దీంతో కొందరు నెటిజనులు నందిని రెడ్డి ని కాపీ కొట్టిందని ఆడిపోసుకుంటున్నారు. ఎంత రీమేక్ అయితే మాత్రం పోస్టర్ ను కూడా మక్కికిమక్కి దించాలా అని విమర్శిస్తున్నారు. 'ఓ బేబీ' టీజర్ కూడా దాదాపు అంతే. వాళ్ళు మర్చిపోయే విషయం ఏంటంటే.. మామూలుగానే నందినిగారు ప్రేరణలతో సినిమాలు తీస్తారు.. ఈసారి రీమేక్ అన్నారు. కష్టం ఎందుకని పోస్టర్ ను కూడా జెరాక్స్ తీశారు.ఆమె తప్పేముంది. తప్పంతా నెటిజనులదే. వీళ్ళకు కొరియా సినిమాల పోస్టర్లతో ఏం పని వచ్చింది? వాటిని చూడడం ఎందుకు.. కాపీ అని మనసును కష్టపెట్ట కోవడం ఎందుకు?