Begin typing your search above and press return to search.
'అరణ్య'లో మరో పెద్ద స్టార్ ఉన్నికృష్ణనే..!
By: Tupaki Desk | 23 March 2021 9:42 AM GMTపాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన త్రిభాషా చిత్రం ''అరణ్య''. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ - జోయా హుస్సేన్ - శ్రియ పిల్గావోంకర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రంలో వీరితో పాటు ఉన్ని కృష్ణన్ అనే మరో పెద్ద స్టార్ నటించారు. ఉన్ని కృష్ణన్ అంటే మనిషి కాదు.. మనదేశంలోని ఓ ఏనుగు. 'కుమ్కి 2' చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ఉన్నికృష్ణన్ అనే ఏనుగు.. ఇప్పుడు 'అరణ్య'లో కీలక పాత్ర పోషించింది.
ఫెస్టివల్ సీజన్స్ లో ఉన్నికృష్ణన్ కు ఉండే భారీ డిమాండ్ కారణంగా.. ఆ ఏనుగు అందుబాటులో ఉన్న తేదీలకు అనుగుణంగా మిగతా నటీనటుల కాల్ షీట్లను డైరెక్టర్ రీషెడ్యూల్ చేసేవారట. దీనిని బట్టి ఈ చిత్రంలో ఉన్ని కృష్ణనే పెద్ద స్టార్ అని అనొచ్చు. ఈక ఈ ఏనుగుతో పాటు థాయిలాండ్ నుండి ఇతర ఏనుగులను తీసుకొచ్చారని తెలుస్తోంది. ఉన్నికృష్ణన్ ను థాయిలాండ్ ఏనుగులకు దూరంగా ఉంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూట్ చేశారట.
'అరణ్య' షూటింగ్ థాయిలాండ్, కేరళ, సతార్, మహాభలేశ్వరం.. వంటి అడవులలో చిత్రీకరించారు. అడవుల నిర్మూలన - జంతువుల సంరక్షణ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రానా తండ్రి పాత్రకు విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పోకుట్టి - సినిమాటోగ్రాఫర్ ఎ.ఆర్. అశోక్ కుమార్ - మ్యూజిక్ డైరెక్టర్ శాంతను మోయిత్ర వంటి ప్రముఖులు ఈ చిత్రం కోసం వర్క్ చేశారు. ఈ మూవీ తెలుగులో 'అరణ్య'.. హిందీలో ‘హథీ మేరే సాథి’.. తమిళంలో ‘కాదన్’ పేర్లతో మార్చి 26న విడుదల కానుంది.