Begin typing your search above and press return to search.

అనుష్క పక్కన చేరిన గ్యారేజ్ విలన్

By:  Tupaki Desk   |   21 July 2016 5:41 AM GMT
అనుష్క పక్కన చేరిన గ్యారేజ్ విలన్
X
స్వీటీ అనుష్క సైజ్ విషయంలో చాలానే డౌట్స్ ఉన్నాయ్ కానీ.. అమ్మడి స్పీడ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. మరి స్లిమ్ అయిపోయి పాత లుక్స్ కి వచ్చిందో లేదో ఎక్కడా రివీల్ కావడం లేదు కానీ.. షూటింగ్స్ మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. కోలీవుడ్ మూవీ సింగం కి సీక్వెల్ ఎస్3 షూటింగ్ తో పాటు.. తెలుగులో భాగమతిలోనూ అనుష్క నటించేస్తోంది.

లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న భాగమతిలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కు ఓ కీలక రోల్ ఆఫర్ చేశారు. తన రోల్ కి సంతృప్తి చెందిన ఉన్ని ముకుందన్.. ఈ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనుష్క మూవీలో లీడ్ రోల్ చేసేందుకు గాను.. ఇప్పటికే ఉన్న ముకుందన్ అగ్రిమెంట్ సైన్ చేశాడని తెలుస్తోంది. రీసెంట్ గా ఎన్టీఆర్-కొరటాల శివ నటించిన జనతా గ్యారేజ్ మూవీ షూటింగ్ ను ఫినిష్ చేసిన ఉన్ని ముకుందన్.. త్వరలో భాగమతి సెట్స్ పై జాయిన్ కానున్నాడని సమాచారం.

భాగమతి మూవీని పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ తెరకెక్కిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ సాగుతుండగా.. డిసెంబర్ నాటికి మొత్తం షూటింగ్ ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది.