Begin typing your search above and press return to search.
అమ్మాయి అవతారంలో భాగమతి హీరో
By: Tupaki Desk | 20 Feb 2018 4:42 AM GMTభాగమతిలో లీడ్ రోల్ - హీరొయిన్ అనుష్కనే అయినప్పటికీ హీరో ఎవరు అంటే గుర్తొచ్చేది ఉన్ని ముకుందనే - మలయాళం హీరో అయిన ఉన్ని ముకుందన్ గతంలో జనతా గ్యారేజ్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ సోదరుడిగా నటించాడు. అందులో నెగటివ్ షేడ్ లో కనిపిస్తే భాగమతిలో పూర్తి విరుద్ధంగా పాజిటివ్ రోల్ లో కనిపించాడు. కాని యాదృచ్చికంగా రెండు సినిమాల్లోనూ ఉన్ని ముకుందన్ పాత్రకు చావు ముగింపు ఉండటం విశేషం. తెలుగులో అడపాదడపా సినిమాలు చేయాలని ట్రై చేస్తున్న ఉన్ని ముకుందన్ ప్రస్తుతం చేస్తున్న మలయాళ సినిమా ఒకటి టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదే చాణక్య తంత్రం. ఇందులో ఉన్ని ముకుందన్ కరిష్మా అనే హిజ్రా పాత్రలో కనిపించడం అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇందుకోసం చాలా రిస్క్ అనిపించే ప్రొస్తేటిక్స్ మేకప్ వేసుకున్నాడు ముకుందన్. గంటల తరబడి కూర్చుని వేయించుకునే ఈ మేకప్ కు చాలా ఓపిక కావాలి. గతంలో శంకర్ ఐ కోసం విక్రం, రోబో కోసం రజనికాంత్, భామనే సత్యభామనే కోసం కమల్ హాసన్ ఇలా అతి తక్కువ హీరోలు దీనికి సిద్ధ పడ్డారు. సహజంగా కనిపించాలి అనే ఉద్దేశంతో దీనికి ఓకే చెప్పినట్టు ఉన్ని ముకుందన్ చెబుతున్నాడు. కన్నన్ తామరకుల్లం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివదా, శృతి రామచంద్రన్ హీరొయిన్లు. తాను ఇప్పటి దాకా చేసిన పాత్రలు ఒక ఎత్తు ఈ కరిష్మా ఒక ఎత్తు అంటున్న ముకుందన్ దీని కోసం బాగా కష్టపడుతున్నాడు.
మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న ఉన్నిముకుందన్ స్వతహాగా గీత రచయిత - గాయకుడు. తన కెరీర్ ను ఆచయన్స్ సినిమాతో అలాగే ప్రారంభించాడు. నటుడిగా 2011 లో సీదన్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉన్ని ముకుందన్ ఆ తరువాత సంవత్సరం వచ్చిన మల్లు సింగ్ అనే సినిమాతో మల్లు వుడ్ లో స్థిరపడి పోయాడు. ఇక అప్పటి నుంచి చెప్పుకోదగ్గ సినిమాలే చేసిన ముకుందన్ ఈ చాణక్య తంత్రం మేజర్ బ్రేక్ అవుతుందని ఆశతో ఉన్నాడు. ఇంత కష్టానికి తగిన ఫలితం దక్కాలనే అతని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇది తెలుగులో కూడా డబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.