Begin typing your search above and press return to search.

రంగ‌మ్మత్త‌ను వ‌ర్చువ‌ల్ హ‌గ్ కోరిన అభిమాని

By:  Tupaki Desk   |   27 May 2021 4:12 PM IST
రంగ‌మ్మత్త‌ను వ‌ర్చువ‌ల్ హ‌గ్ కోరిన అభిమాని
X
మీరు న‌టించిన `థాంక్యూ బ్ర‌ద‌ర్` సినిమా వీక్షించాను. వెంట‌నే మిమ్మ‌ల్ని టైట్ గా హ‌గ్ చేసుకోవాల‌నుంది. కానీ కుద‌ర‌దు. అందుకే వ‌ర్చువ‌ల్ హ‌గ్ ఇస్తున్నా! అంటూ అన‌సూయ‌పై అభిమానం చూపించారు ఒక వీరాభిమాని. దానికి థాంక్యూ అంటూ న‌వ్వేశారు అన‌సూయ భ‌ర‌ద్వాజ్.

ఓవైపు పెద్ద హీరోల సినిమాల్లో ముఖ్య‌మైన‌ క్యారెక్ట‌ర్ల‌లో న‌టిస్తూనే మ‌రోవైపు క‌థానాయిక‌గానూ నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల్లోనూ అన‌సూయ నిరూపించుకునేందుకు త‌పిస్తున్నారు. థాంక్యూ బ్ర‌ద‌ర్ లో త‌న న‌ట‌న‌కు పేరొచ్చింది. ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. కెరీర్ ఒకెత్తు అనుకుంటే మ‌రోవైపు అన‌సూయ గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లు అభిమానుల్లో వైర‌ల్ గా మారుతున్నాయి. రంగ‌మ్మ‌త్త షేర్ చేసిన తాజా ఫోటోషూట్ అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. డార్క్ పింక్ డిజైన‌ర్ చీర‌లో అన‌సూయ సొగ‌సు సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది.

ఇక గ్లామ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ ఒక‌వైపు అనుకుంటే.. మ‌రోవైపు సామాజిక సేవ‌ల్లోనూ అన‌సూయ త‌న‌దైన చొర‌వ చూపిస్తున్నారు. ప్ర‌స్తుత సెకండ్ వేవ్ క్రైసిస్ లో పేద‌రికంలో ఉన్న 100 కుటుంబాల‌కు త‌న‌వంతు నిత్యావ‌స‌రాల సాయం చేశారు. వీకేర్ ఎన్జీవో తో క‌లిసి ఈ సేవ‌ల్ని చేస్తున్నారు. కొంద‌రితో క‌లిసి అన‌సూయ పేద‌ల‌కు మాన‌వ‌తా సాయం చేయ‌డం హ‌ర్ష‌ణీయం అని ప్ర‌శంసిస్తున్నారు.