Begin typing your search above and press return to search.
బాలయ్యతో పవన్... రేర్ కాంబోకి అదే వేదిక....?
By: Tupaki Desk | 6 Oct 2022 2:18 AM GMTనందమూరి బాలక్రిష్ణ ప్రముఖ నటుడే కాదు మంచి హోస్ట్ అని నిరూపించినది అన్ స్టాబబుల్ రియాల్టీ షో. ఈ షో తరువాత బాలయ్య ఇమేజ్ వేరే రేంజికి చేరింది. ఇక బాలయ్య సీజన్ వన్ లో ఎందరినో ఇంటర్వ్యూ చేశారు. తనదైన ఫన్నీ డైలాగ్స్, మ్యానరిజం తో పంచులతో సూపర్ స్టార్ మహేష్ లాంటి వారిని కూడా సరికొత్తగా జనాలకు చూపించారు. బాలయ్య అయితే తానుగా ఏంటి అన్నది ఎవరికీ తెలియని కొత్త కోణాన్ని చూపించారు. అంతే కాదు గెస్టులుగా వచ్చిన వారిని సైతం నవ్వించి కవ్వించి వారి గురించి ఇప్పటిదాకా బయట జనాలకు తెలియని అనేక విషయాలను ఆవిష్కరించారు.
అలాంటి బాలయ్య అన్ స్టాపబుల్ రియాల్టీ షో సీజన్ టూ స్టార్ట్ అయింది. మరి ఈ సీజన్ లో ఎవరెవరు గెస్టులుగా వస్తారు, బాలయ్య ఎవరితో చిట్ చాట్ చేయబోతున్నారు అన్నది ఆసక్తిని పెంచుతున్న అంశం. ఈ షో గెస్టుల గురించి ఇప్పటికి అందుతున్న వార్తలు, వైరల్ అవుతున్నా విషయాలు చూస్తే క్యూరియాసిటీ అయితే పెద్ద ఎత్తున పెరిగిపోతోంది.
ఇల లెటేస్ట్ గా ప్రచారంలోఉన్న విషయం అయితే పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ షోకి గెస్ట్ గా వస్తారని, ఆయన కనుక వచ్చి బాలయ్యతో స్క్రీన్ పంచుకుంటే ఏమైనా ఉందా. ఈ ఇద్దరు కలిస్తే పూనకాలే కదా. అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకుంటారు కదా.
అందుకే ఆహా నిర్వాహకులు ఈ ఇద్దరినీ కలిపేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు మొదలెట్టేశారని టాక్ నడుస్తోంది. దానికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు అని కూడా ప్రచారం ఒక స్థాయిలో సాగుతోంది. ఇక అన్ స్టాపబుల్ షో టీయార్పీ రేటింగ్ అయితే అదిరిపోయే రేంజిలో ఉంది. ప్రాంతీయ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారాలల్లో కూడా పెను సంచలనాలు సృష్టిస్తోంది.
అలాంటిది ఇపుడు పవన్ బాలయ్యలను కలిపితే ఇక పాత రికార్డులు అన్నీ బద్ధలు కావాల్సిందే కదా. అందరి కళ్లూ ఈ షో మీదనే ఉంటాయి కదా. ఇక బాలయ్య, పవన్ కూడా కేవలం నటులే కాదు రాజకీయాల్లో ఉన్నారు. ఏపీలో చూస్తే వైసీపీకి యాంటీగా టీడీపీ జనసేన గట్టిగానే పోరాడుతున్నాయి.
పొత్తులు కూడా కుదిరే చాన్స్ ఉందని వార్తలు వస్తున్న క్రమంలో టీడీపీ టాప్ లీడర్ అయిన బాలయ్యతో పవన్ కనుక కలసి కనిపిస్తే ఈ మల్టీస్టార్ ని చూసేందుకు అటు సినీ తెరకు ఇటు రాజకీయ తెరకు కూడా ఆకాశమే హద్దు కావాలేమో. ఇక కోటి కళ్ళు ఇచ్చినా చాలవని ఇద్దరు ఫ్యాన్స్ తో పాటు తటస్థ జనాలు కూడా అంటారేమో. ఏది ఏమైనా ఈ ఇద్దరూ షోలో కలవాలని చిట్ చాట్ చేయాలని అంతా గట్టిగానే కోరుకుంటున్నారు. ఇది జరుగుతుందా. ఏమో రేపటి సెన్సేషనల్ న్యూస్ ఇదే అవుతుందేమో. వెయిట్ అండ్ సీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.