Begin typing your search above and press return to search.

అన్‌ స్టాపబుల్‌ : పవన్‌ ను కలిసిన 'N' వారసుడు!

By:  Tupaki Desk   |   29 Dec 2022 10:19 AM IST
అన్‌ స్టాపబుల్‌ : పవన్‌ ను కలిసిన N వారసుడు!
X
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్‌ షో లో పవన్ కళ్యాణ్‌ పాల్గొన్న విషయం తెల్సిందే. అన్నపూర్ణ స్టూడియో లో అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ జరిగింది. పవన్‌ హాజరు అయిన సమయంలో షో నిర్వాహకులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

సాదారణంగా అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్స్‌ ఇద్దరు గెస్ట్‌ లు రావడం.. వారితో మాట ముచ్చట.. ఆటలు పాటలు ఉంటాయి. అయితే పవన్ ఎపిసోడ్‌ లో మాత్రం అంతకు మించి ఉండబోతున్నాయని లీక్స్ మీద లీక్స్ వస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌ లో త్రివిక్రమ్‌ కొద్ది సమయం కనిపిస్తారు.. పవన్‌ తో పాటు క్రిష్ ఇంకా సాయి ధరమ్‌ తేజ్ లు కూడా కనిపించారు.

వీళ్లు మాత్రమే కాకుండా మరి కొందరు ఆన్‌ లైన్‌ మరియు ఆఫ్ లైన్ ద్వారా ఈ షో లో సందడి చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎపిసోడ్‌ చివర్లో బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ కూడా స్టేజ్ పై సందడి చేశాడట.

పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు ఒక ఫొటో కూడా తీసుకున్నాడు అంటూ ఫ్లోర్‌ ఆడియన్స్‌ బయట లీక్ చేస్తున్నారు.

ఎపిసోడ్‌ లో మోక్షజ్ఞ విజువల్స్ ఉంటాయా లేదా అనే విషయం క్లారిటీ లేదు... కానీ ఆ తర్వాత లేదా అంతకు ముందే మోక్షజ్ఞ గ్లిమ్స్ ను సోషల్‌ మీడియా ద్వారా ఆహా వారు షేర్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పవన్‌ కళ్యాణ్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ గురించి అన్‌ స్టాపబుల్‌ గా చర్చ జరుగుతూనే ఉంది.

ఈ సీజన్ యొక్క చివరి ఎపిసోడ్‌ గా పవన్ కళ్యాణ్ వచ్చిన ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం కానుకగా లేదంటే సంక్రాంతి కానుకగా అన్‌ స్టాపబుల్‌ పవన్ ఎపిసోడ్‌ యొక్క ప్రోమో ను విడుదల చేసే విధంగా ఆహా వారు ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.