Begin typing your search above and press return to search.

NBK షోకి గాలం వేస్తున్న అంత‌ర్జాతీయ దిగ్గజం

By:  Tupaki Desk   |   30 Dec 2022 3:51 AM GMT
NBK షోకి గాలం వేస్తున్న అంత‌ర్జాతీయ దిగ్గజం
X
ఆహా - తెలుగు ఓటీటీ ఇటీవ‌ల సెన్సేష‌న్ గా మారింది. ఆరంభం కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ బాస్ అల్లు అర‌వింద్ ముందు చూపు అజేయ‌మైన ఆలోచ‌నా శ‌క్తితో ఆహాను విజ‌య‌వంతంగా ముందుకు న‌డిపిస్తున్నారు. ముఖ్యంగా ఆహా స‌క్సెస్ వెన‌క భారీ పెట్టుబ‌డుల‌తో నిర్మించే ఒరిజిన‌ల్ కంటెంట్ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఇటీవ‌ల‌ నందమూరి బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్' బంపర్ హిట్. ఇది అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోను టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ముఖ్యంగా బాల‌య్య మాస్ అభిమానులు ఈ షోని పెద్ద హిట్ చేసారు. ఇది ఆహా యాప్ క్రేజ్ ను మ‌రో స్థాయికి తీసుకువెళ్లింది.

ఇప్పుడు ఆహా షోలను ఇత‌ర కార్పొరెట్ ఓటీటీల‌తో షేర్ చేసుకునే ఆలోచ‌న దిశ‌గా అల్లు అరవింద్ ఆలోచిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తన ప్రొడక్షన్ వెంచర్లలో చాలా వరకు ఆహా - నెట్ ఫ్లిక్స్ రెండింటికీ కలిసి విక్రయించడంలో తెలివైన ఎత్తుగ‌డ‌ను అనుస‌రిస్తున్నారని టాక్ స్ప్రెడ్ అవుతోంది.

నెట్ ఫ్లిక్స్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ప్రపంచంలోనే టాప్ ఓటీటీగా వెలిగిపోతున్న స‌ద‌రు కార్పొరెట్ దిగ్గ‌జం తెలుగు ప్లాట్ ఫామ్ ఆహాకు అద్భుతమైన ఆఫర్ ను అందించిందన్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ఈ డీల్ కుదిరితే భారీ ప్యాకేజీని ఆహా క‌ర్త‌ల‌కు అందించే వీలుంద‌ని అంచ‌నా. ఎన్.బి.కే 'అన్ స్టాపబుల్' మొత్తం ఎపిసోడ్ లను ప్రసారం చేయడానికి సీజన్ 01 - సీజ‌న్ 02 రెండింటినీ కొనుగోలు చేసేందుకునెట్ ఫ్లిక్స్ భారీ డీల్ ను కుదుర్చుకుంద‌ని టాక్ ఇప్ప‌టికే స్ప్రెడ్ అయింది. ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స‌హా ప్ర‌భాస్ ఎపిసోడ్ ల‌ను ఆహాతో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా ఒకేసారి ప్రసారం చేయాలని కోరుకుంటోందన్న టాక్ ఉంది. ప్రభాస్- పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ లు అన్ స్టాపబుల్ గేమ్ ను కొత్త స్థాయికి తీసుకెళుతున్నాయి.

అందుకే నెట్ ఫ్లిక్స్ ఈ ఎప‌సోడ్ల‌న్నిటినీ గంప‌గుత్త‌గా కొనేయాల‌నుకుంటోంది. నెట్ ఫ్లిక్స్ తో పాటు మరో రెండు టాప్ ఓటీటీలు కూడా ఆహా టాక్ షోల‌ను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే 'అన్ స్టాపబుల్' షోను మేక‌ర్స్ కేవ‌లం ఆహా కోస‌మే కేటాయిస్తారా? లేక కార్పొరెట్ దిగ్గ‌జానికి అమ్మేస్తారా? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. నెట్ ఫ్లిక్స్ కి రీ-టెలికాస్ట్ హక్కులను విక్రయిస్తార‌న్న చ‌ర్చా సాగుతోంది. అయితే 'ఆహా' బాస్ అల్లు అర‌వింద్ కాంపౌండ్ నుంచి దీనిపై అధికారిక స‌మాచారం అందాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.