Begin typing your search above and press return to search.
అప్పుడు సారా .. ఇప్పుడు విస్కీ: మోహన్ బాబు
By: Tupaki Desk | 5 Nov 2021 6:30 AM GMT'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను మరింత విస్తృతం చేసే దిశగా అల్లు అరవింద్ ముందుకు వెళుతున్నారు. అతి పెద్ద ఓటీటీ సంస్థల టార్గెట్ ను అందుకోవడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే కొత్త కాన్సెప్టులను డిజైన్ చేయిస్తున్నారు. గేమ్ షోలు .. కామెడీ షోలు .. వెబ్ సిరీస్ లు చేయడానికి స్టార్ డైరెక్టర్లను రంగంలోకి దింపుతున్నారు. 'అన్ స్టాపబుల్' టాక్ షోకి బాలకృష్ణను ఒప్పించడాన్ని బట్టి .. ఆయనకి ఒక రేంజ్ లో పారితోషికాన్ని ఫిక్స్ చేయడాన్ని బట్టి అల్లు అరవింద్ ఏ స్థాయిలో దృష్టి పెట్టారనేది అర్థం చేసుకోవచ్చు.
'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' టాక్ షోలో ఫస్టు ఎపిసోడ్ ను మోహన్ బాబుతో చేశారు. ఈ షోకి ఆయనతో పాటు మంచు విష్ణు .. లక్ష్మి కూడా హాజరయ్యారు. దీపావళి కానుకగా నిన్న ఫస్టు ఎపిసోడ్ ను వదిలారు. కాస్త కామెడీగా .. మరికాస్త ఎమోషనల్ గా ఈ ఎపిసోడ్ నడిచింది. మెహన్ బాబు సినిమాల్లో రావడానికి ముందు .. వచ్చిన తరువాత .. మధ్యలో అవకాశాలు తగ్గినప్పటి పరిస్థితి .. నిర్మాతగా విజయాలను .. అపజయాలను అందుకున్నప్పటి పరిస్థితి .. ఆ సమయంలో ఆయన పొందిన అనుభవాలు .. ఇవన్నీ కూడా ఈ వేదికపై ఆవిష్కరించబడ్డాయి.
ఇటు బాలకృష్ణగానీ .. అటు మోహన్ బాబు గానీ ఇద్దరిదీ కూడా వెనక్కి తగ్గని స్వభావం. ఇద్దరూ ముక్కుసూటిగా వెళ్లేవారే. తడుముకోవడాలు .. తడబడటాలు అలవాటులేని వారే. ప్రశ్నలు ఎంత పవర్ఫుల్ గా వెళతాయో .. సమాధానాలు కూడా అంతే పదునుగా వస్తాయి. అందువలన ఈ ఇద్దరి మధ్య నడిచిన ఈ షో ఆసక్తికరంగా సాగింది. డిజిటల్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. బాలకృష్ణ ప్రశ్నకి సమాధానంగా మోహన్ బాబు తన అభిప్రాయాలను .. అభిరుచులను మాత్రమే కాదు, తనకి గల చెడు అలవాట్లను కూడా నిర్మొహమాటంగా చెప్పేశారు.
మద్రాసులో కెరియర్ ఆరంభించిన కొత్తలో 'సారా' తాగేవాడిని. కోడంబాకం బ్రిడ్జి క్రింద అప్పట్లో సారాయి దుకాణాలు ఎక్కువగా ఉండేవి. ఓ స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లేవాడిని .. సారా తాగేసి వచ్చేవాడిని. కెరియర్ సాఫీగా సాగని రోజుల్లో కూడా సారానే తాగేవాడిని. అప్పుడున్న పరిస్థితి అది .. ఇప్పుడు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కనుక, కాస్త మంచి విస్కీ తాగుతున్నాను" అని చెప్పుకొచ్చారు. గతంలో మోహన్ బాబు చాలా వేదికలపై ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ అప్పుడు చెప్పని చాలా విషయాలను ఆయన ఈ వేదిక ద్వారా పంచుకోవడం విశేషం.