Begin typing your search above and press return to search.

అన్ స్టాప‌బుల్ 2 : బావా అళ్లుడితో బాల‌య్య హంగామా!

By:  Tupaki Desk   |   11 Oct 2022 3:07 PM GMT
అన్ స్టాప‌బుల్ 2 : బావా అళ్లుడితో బాల‌య్య హంగామా!
X
వెండితెర‌పై త‌న‌దైన స్టైల్ తో మెస్మ‌రైజ్ చేస్తున్న బాల‌య్య తొలిసారి `ఆహా` ఓటీటీ కోసం `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` అంటూ టాక్ షోతో దుమ్ము దులిపేశాడు. త‌న సినిమాల్లాగే షోని కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని చేసేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. మొద‌టి సీజ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో సీజ‌న్ 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మంగ‌ళ‌వారం సీజ‌న్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన టీజ‌ర్ ని రిలీజ్ చేశారు. ఫ‌స్ట్ సీజ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్ ని క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుతో మొద‌లు పెట్టిన బాల‌య్య సీజ‌న్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్ ని మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ తో మొద‌లు పెట్టాడు.

తాజాగా మంగ‌ళ వారం విడుద‌ల చేసిన ప్రోమో విశేషంగా ఆక‌ట్టుకుంటూ ఫుల్ ఎపిసోడ్ పై భారీ స్థాయిలో అంచ‌నాల్ని పెంచేసింది. `స‌దా న‌న్ను కోరుకునే మీ అభిమానం అన్ స్టాప‌బుల్ ని టాక్ షోల‌కు అమ్మ మొగుడిగా చేసింది.

అనే బాల‌య్య జోష్ ఫుల్ డైలాగ్ ల‌తో ప్రోమో మొద‌లైంది. నా బంధువుని పిలుద్దామ‌నుకున్నా.. అయితే ప్ర‌జ‌లంద‌రి బంధువైతే బాగుండ‌నిపించింది. అందుకే మీకు బాబుగారూ.. నాకు బావ‌గారు.. లెట్స్ వెల్క‌మ్ వ‌న్ ఆఫ్ ద టాలెస్ట్ ఇండియ‌న్ లీడ‌ర్స్ ఆఫ్ ఇండియ‌న్ పాలిటిక్స్ అంటూ నారా చంద్ర బాబు నాయుడిని షో లోకి ఆహ్వానించాడు బాల‌య్య‌.

ఈ సంద‌ర్భంగా స్వ‌యానా బావ అయినా నారా చంద్ర బాబు నాయుడు కి బాల‌య్య ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డం అక్క‌డున్న వారిని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఆ త‌రువాత నారా లోకేష్ షో లోకి ఎంట్రీ ఇచ్చాడు. త‌ను రావ‌డానికి ముందే టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి ఎన్‌. టి. రామారావు నుంచి చంద్ర బాబు నాయుడు అధికారాన్ని చేజిక్కించుకున్నార‌నే వివాదాస్ప‌ద అంశాన్ని నేరుగా బాల‌య్య ట‌చ్ చేయ‌డం.. దానికి చంద్ర బాబు నాయుడు అంతే సెన్సిటీవ్ గా స‌మాధానం చెప్ప‌డం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

బాబు రాజ‌కీయ జీవితంలో అత్యంత వివాదాస్ప‌ద అంశంగా ఇప్ప‌టికీ వెంటాడుతున్న ఈ సున్నిత‌మైన అంశంపై ఆయ‌న చెప్పిన స‌మాధానం ఏంటీ?.. ఆ త‌రువాత అదే స్థాయిలో నారా లోకేష్ పై కూడా బాల‌య్య ప్ర‌శ్న‌లు సంధించారు. మంగ‌ళ గిరిలో తొలి సారి పోటీ చేసి ఓడిపోవ‌డం ఎలా వుంద‌ని దానికి నారా లోకేష్ అదే స్థాయిలో స‌మాధానం చెప్ప‌డం .. ప్రోమోలో కొంత క‌ట్ చేసి స‌స్పెన్స్ మెయింటైన్ చేశారు. చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ ల‌ని ఓ ద‌శ‌లో త‌న‌దైన ప్ర‌శ్న‌ల‌తో బాల‌య్య ఆట‌ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశాడు.

దీనికి నారా లోకేష్ కూడా తానేమీ త‌క్కువ కాద‌న్న‌ట్టుగా హోస్ట్ సీట్ లోకి మారి బాల‌య్య‌ను ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌లు వేయ‌డం. అది చూసి నారా చంద్ర బాబు నాయుడు న‌వ్వు కోవ‌డం భ‌లే స‌ర‌దాగా అనిపించ‌క మాన‌దు. అంతే కాకుండా చంద్ర‌బాబు యంగ్ ఏజ్ లో చేసిన అల్ల‌రి ప‌నులు.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో వున్న స్నేహ బంధం గురించి వెల్ల‌డించిన తీరు .. ఇలా అన్ స్టాప‌బుల్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో దుమ్ము లేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ పూర్తి ఎపిసోడ్ అక్టోబ‌ర్ 14 న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.