Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ ప్రభాస్ పార్ట్ 2.. ఎంత పని జరిగింది..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 6:00 AM GMT
అన్ స్టాపబుల్ ప్రభాస్ పార్ట్ 2.. ఎంత పని జరిగింది..!
X
బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది. ఇక ఈ సీజన్ లో బాహుబలి ప్రభాస్ గెస్ట్ గా రావడం షోకి మరింత హైప్ తెచ్చింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేశారు ఆహా టీం.

అయితే ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో అదరగొట్టగా ఆ ఎపిసోడ్ రిలీజ్ అయిన టైం లో ఆహా సర్వర్ కూడా హ్యాంగ్ అయ్యేలా ఎటాక్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ ఎపిసోడ్ చూసేందుకు ఆహా ని ఓపెన్ చేయగా లిమిట్ దాటడంతో ఆ యాప్ కాస్త ఆగిపోయింది. రెండు మూడు గంటల పాటు ఆ ఎపిసోడ్ రాలేదు.

బాహుబలి తో బాలయ్య పార్ట్ 1 ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. అయితే అదే ఎపిసోడ్ పార్ట్ 2 ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఎందుకో ఏమో కానీ పార్ట్ 1 కి వచ్చినంత బజ్ పార్ట్ 2 కి రాలేదు. ఆహా టీం చేసిన ఈ అతి తెలివి పనికి వారికి ఆడియన్స్ కూడా షాక్ ఇచ్చారు.

పార్ట్ 1 లోనే ప్రభాస్ పెళ్లి గురించి ఆ మేడం ఎవరు అంటూ ఓ రకంగా విసిగించాడు బాలయ్య. పార్ట్ 2లో కూడా ప్రభాస్ రాజుకి రాణి ఎవరు అంటూ మరో గెస్ట్ గా వచ్చిన గోపీచంద్ తో చెప్పించాలని ప్రయత్నించారు.

సో మొత్తం ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆరా తీయడమే సరిపోయింది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లిపై మీడియాలో రచ్చ తెలిసిందే. అయితే ఆల్రెడీ మీడియాలో నలుగుతున్న మ్యాటర్ ని అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అంతా సాగదీయడం ఫ్యాన్స్ కి నచ్చలేదు. పార్ట్ 2లో గోపీచంద్ ఎంట్రీ ఇచ్చినా అంత పెద్ద కిక్ ఇవ్వలేదు. వారి సినిమాల గురించి బాలయ్య రివ్యూ ఇచ్చాడు.. వారి కెరీర్ గురించి కూడా బాలకృష్ణ ప్రస్తావించారు.

ఇదంతా చాలా తక్కువ టైం కాగా కేవలం ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం షో మీద ఆసక్తి లేకుండా చేసింది. అందుకే పార్ట్ 1 తో ఆహా హ్యాంగ్ అయ్యే రేంజ్ లో ఆడియన్స్ చూడగా పార్ట్ 2 ని మాత్రం సోసోగానే చూశారని తెలుస్తుంది. పార్ట్ 2కి సంబంధించిన ప్రోమోలో ఎపిసోడ్ పై ఆసక్తి కలిగించాలని ప్రయత్నించినా వర్క్ అవుట్ అవలేదు. సో ఆహా టీం చేసిన ఈ రెండు పార్టుల ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.