Begin typing your search above and press return to search.
'బింబిసార'కి బీజం ఎలా పడిందంటే ..!
By: Tupaki Desk | 27 July 2022 3:30 AM GMTసాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ మొదలవుతూ ఉంటాయి. ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్త కొత్త పద్ధతులను ఫాలో అవుతుండటం చూస్తున్నాము. ఒక సినిమా ప్రమోషన్స్ లో ఆ సినిమా కోసం పడిన కష్టనష్టాలు .. ఆ ప్రాజెక్టు ఎలా సెట్ అయిందనేది చెబుతుంటారు.
కానీ తన సినిమా 'బింబిసార' ప్రమోషన్స్ విషయంలో కల్యాణ్ రామ్ కొత్త పద్ధతిని ఫాలో అయ్యాడని చెప్పాలి. తన బాల్యం నుంచి మొదలుపెట్టేసి .. 'బింబిసార' వరకూ గల తన ప్రయాణాన్ని చాలా తక్కువ సమయంలో చెప్పేస్తూ, అందరికీ ఈ సినిమాను టచ్ లో ఉంచుతున్నాడు.
'అప్ క్లోజ్ విత్ ఎన్కే ఆర్' అనే టైటిల్ తో ఎపిసోడ్ వైజ్ గా ఒక్కో వీడియోను వదులుతూ వెళుతున్నాడు. సెకండ్ వీడియోలో ఆయన మాట్లాడుతూ .. "తాతగారు .. బాబాయ్ గారు .. ఆ తరువాత నాన్నగారు సినిమాలు చేస్తూ వచ్చారు.
తాతగారి సినిమాల ప్రభావం మాపై ఎక్కువగా ఉండేది. బయటికి వెళితే చాలు అందరూ కూడా ఆయన గురించి గొప్పగా చెబుతుండేవారు. అప్పుడు ఆయన మాదిరిగానే ఆడియన్స్ ను ఆకట్టుకునే మంచి మంచి సినిమాలు చేయాలని అనిపిస్తూ ఉండేది.
తాతగారు చేసిన సినిమాల్లో పౌరాణికాలు .. జానపదాలు .. సోషియో ఫాంటసీ సినిమాలను మేము బాగా ఇష్టపడేవాళ్లం. 'గులేబకావళి కథ' .. ' పాతాళ భైరవి' .. 'జగదేకవీరుడు' .. బాబాయ్ చేసిన 'భైరవద్వీపం' .. 'ఆదిత్య 369' సినిమాలు .. తమ్ముడు చేసిన 'యమదొంగ' సినిమాలను గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని.
ఇప్పటి పిల్లలు ఎంజాయ్ చేసే హాలీవుడ్ సినిమాలను తెలుగులో చేస్తే బాగుంటుంది కదా అనిపించేది. అలాంటి పరిస్థితుల్లోనే ఒక రోజున నాకు డైరెక్టర్ వశిష్ఠ మెసేజ్ పెట్టాడు .. ఒక కథను వినిపిస్తానని.
తను నాకు 'పటాస్' సినిమా నుంచి పరిచయం. ఆఫీసుకు రమ్మని నేను అనడంతో అక్కడికి వచ్చేశాడు. 'బింబిసార' ప్రయాణం అక్కడి నుంచి మొదలైంది. ఆ సినిమాకి సంబంధించిన వింతలు .. విశేషాలు .. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేది మరో ఎపిసోడ్ లో తెలుసుకుందాం .. అప్పటి వరకూ వెయిట్ చేయండి" అంటూ చెప్పుకొచ్చాడు. కేథరిన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా అలరించిన ఈ సినిమాకి, చిరంతన్ భట్ స్వరాలను సమకూర్చగా, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు.