Begin typing your search above and press return to search.
'రేసుగుర్రం' నటుడికి Y+ భద్రత...!
By: Tupaki Desk | 1 Oct 2020 12:10 PM GMTబాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ తో లింకులు ఉన్న పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నలుగురు స్టార్ హీరోయిన్లను సైతం విచారించారు. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రగ్ మాఫియా గురించే చర్చించుకుంటున్నారు. అయితే 'రేసుగుర్రం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు, బీజీపీ ఎంపీ రవి కిషన్ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో డ్రగ్స్ అంశాన్ని లేవనెత్తారు. దేశంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోందని.. యువతను తప్పుడు మార్గంలో నడిపించే కుట్ర జరుగుతున్నదని పేర్కొన్నాడు.
అలానే పాకిస్థాన్ - చైనా నుంచి పంజాబ్ - నేపాల్ ద్వారా దేశంలోకి డ్రగ్స్ సప్లై అవుతున్నాయని.. ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిపోతున్నదని రవి కిషన్ పార్లమెంట్ లో వినిపించారు. అంతేకాకుండా పార్లమెంట్ లో సినీ నటి, ఎంపీ జయబచ్చన్ చేసిన వ్యాఖ్యలపై రవికిషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినీ పరిశ్రమ ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా కొందరు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో రవికిషన్ కు, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. దీంతో డ్రగ్స్ రాకెట్ నుంచి బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయని.. భద్రత పెంచాలని ప్రభుత్వాలకు విన్నవించుకొన్నాడు.
ఈ నేపథ్యంలో రవి కిషన్ కు యూపీ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. ఆయనకు Y+ క్యాటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తనకు Y+ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు పేర్కొన్న యూపీ ప్రభుత్వానికి.. సీఎం యోగిత్యానాథ్ కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు రవి కిషన్. నా కుటుంబానికి, నియోజకవర్గ ప్రజల కోసం తీసుకొన్న నిర్ణయం ఆనందం కలిగించింది. ప్రభుత్వ అండతో నా గళాన్ని ప్రజల కోసం వినిపించడంలో రాజీ పడబోనని ట్వీట్ చేసాడు.