Begin typing your search above and press return to search.
'సమంతది చాలా స్వచ్ఛమైన మనసు.. నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్ జెండర్'
By: Tupaki Desk | 12 Nov 2021 4:30 PM GMTమెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఓవైపు అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ గా ఉంటూనే.. మరోవైపు ఫ్యామిలీ బాధ్యతలు కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అంతేకాదు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉపాసన కామినేని గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఉపాసన.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు.. తన భర్త చరణ్ గురించిన సంగతులు పంచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన.. స్టార్ హీరోయిన్ సమంత తో స్నేహం గురించి.. తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఉపాసన మాట్లాడుతూ తనకు నాన్ వెజ్ తినే అలవాటు ఉందని.. దసరా పండుగకు కూడా మాంసం తింటానని.. కానీ సమంతతో పరిచయం ఏర్పడిన తర్వాత మాంసం తినడం తగ్గించానని చెప్పుకొచ్చింది. సామ్ చాలా మంచిది. ఆమెది చాలా స్వచ్ఛమైన మనసు.. స్వచ్ఛమైన ప్రేమ. అది చాలా తక్కువ మందికే తెలుసు. ఆమెలో సాయం చేసే గుణం కూడా ఎక్కువే. అది అందరికి నచ్చుతుంది. ఎన్నో విషయాల్లో ఆమె నాకు సాయం చేసింది అని ఉపాసన తెలిపింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. గోల్డెన్, సిల్వర్, ప్లాటినం స్పూన్ తో పుట్టినంత మాత్రాన వారి లైఫ్ అంత ఈజీగా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరు అనుకుంటున్నట్టుగా లైఫ్ అంతా ఈజీగా ఉండదు. ఇది కూడా ఒక టఫ్ జర్నీ. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి వుంటాయి. ఒకరి బాధను ఒకరూ రెస్పెక్ట్ చేయాలి. ఓ అమ్మాయి ఫ్యాన్సీ కారులో తిరుగుతూ, తన ఇష్టంగా తన జీవితం జీవిస్తుంటే ఆమెను చూడు ఎంత ఎంజాయ్ చేస్తుందో అంటూ అసూయ పడతారు. అలా అయితే నేను కూడా ఎలాంటి సమస్యలు, ఒత్తిడి లేకుండా హ్యాపీ జీవించేవారిని చూసి అసూయ పడతాను. అడవుల్లో జీవించే చెంచుల జీవితం నాకు చాలా బాగా నచ్చుతుంది. నేనూ అలా మారితే బాగుండు అనిపిస్తుంది అని అన్నారు.
అప్పట్లో తనను లడ్డు అంటూ బాడీ షేమింగ్ చేసారని.. ఆ కామెంట్స్ తీవ్రంగా బాధించాయని ఉపాసన తెలిపారు. ఇప్పుడు నన్ను చూసి చాలా మంది బాగున్నావని అంటున్నారు. కానీ అది పెద్ద కాంప్లిమెంట్ గా తీసుకోలేకపోతున్నాను. నేను ఇలా తయారవ్వడానికి దానిపై చాలా శ్రద్ధ పెట్టాను.. గంటలు గంటలు దాని మీదే వర్క్ చేస్తున్నాను కాబట్టి సన్నగా అయ్యాను అని చెప్పారు. మహిళలు, పురుషులకు మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడుతూ.. అలా బేధం చూడటం కూడా అనవసరమని.. ఎవరి బలం వారికి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్జెండర్ అని ఉపాసన తెలిపారు. తను అన్ని విషయాల్లో చురుగ్గా.. మంచి ప్రతిభ కలిగి ఉంటారని ఉపాసన చెప్పుకొచ్చింది. పిల్లల గురించి అడుగగా అది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని అన్నారు.