Begin typing your search above and press return to search.
తాత గారితో కలసి కవర్ పైన..
By: Tupaki Desk | 6 March 2017 5:00 PM GMTమెగా పవర్ స్టార్ వైఫ్ ఉపాసన కార్పొరేట్ ప్రపంచంలో గుర్తింపు పొందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. అపోలో వారసురాలిగా.. ఈమె ఎప్పటినుంచో హై ప్రొఫైల్ వరల్డ్ కి సుపరిచితురాలే. ఇప్పుడీమె బిజినెస్ మ్యాన్ వారసురాలిగా సత్తా చాటేస్తోంది కూడా.
తాజాగా బిజినెస్ ఇండియా మేగజైన్ కోసం.. అపోలో ఛైర్మన్ డా. సి.ప్రతాప్ రెడ్డి ఫోటోను కవర్ పేజ్ పై వేస్తే.. అదే కవర్ పై ఉపాసనకు కూడా చోటు దక్కింది. అపోలో గ్రూప్ హెడ్ గా ఆయన పేరును.. బిజినెస్ మేగజైన్ కవర్ పేజ్ పై వేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ అదే పేజ్ పై కొంచెమే అయినా సరే.. అసలు చోటు దక్కించుకోవడం అంటేనే ఉపాసన రేంజ్ ఎంతగా పెరుగుతోందో అర్ధమవుతోంది. ఇప్పటికే అపోలో లైఫ్ సైన్ను లీడ్ చేస్తున్న ఉపాసన.. సోషల్ మీడియా ద్వారాను.. యాక్టివిటీస్ ద్వారాను హెల్త్ కాపాడుకోవాల్సిన అవసరంపై ప్రచారం చేస్తూ ఉంటుంది.
అటు పెద్దాయన అనారోగ్యాలను తరిమేసే హాస్పిటల్స్ కు యజమాని అయితే.. ఇటు మనవరాలు అసలు రోగమే రాకుండా ఉండేలా జాగ్రత్త పడమని చెబుతూ ఉంటుంది. టో ఫిట్నెస్.. వెల్నెస్ గురించి ఈమె చేస్తున్న ప్రచారం గురించి ప్రత్యేకంగా ఈ మేగజైన్ లో ప్రస్తావించారు. మిస్టర్ సి.. చెర్రీ పాటించే ఫిట్నెస్ కూడా కబుర్లను చెబుతూ అందరికీ బాగా దగ్గరైపోయిన ఉపాసన.. ఇప్పుడు ఆ తాతయ్య వారసురాలిగా తన రేంజ్ ఏంటో చూపించే స్థాయికి చేరుకుందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/