Begin typing your search above and press return to search.
చేపల వంటకంపై ఉపాసన టిప్స్
By: Tupaki Desk | 3 Jan 2019 8:43 AM GMTక్రియేటివిటీ ఉంటే .. బుర్ర ఉపయోగిస్తే.. ఎంచక్కా పచ్చి చేపను ఉప్పు కారం లేకుండానే తినొచ్చని ప్రూవ్ చేసింది రామ్‌చరణ్ టీమ్. కనీస సౌకర్యాలు లేని చోట ఆన్ లొకేషన్ వంట చేయాలంటే ఇంతకంటే వేరే ఆప్షన్ లేనేలేదని ప్రాక్టికల్ గా లైవ్ లో చూపించారు ఉపాసన, చరణ్ & టీమ్.
తాజాగా ఉపాసన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఈ వీడియో లోకులకు కొత్త పాఠం నేర్పిస్తోంది. ఉప్పు - కారం లేని స్టార్ హోటల్ ఫుడ్ కంటే లైవ్ లో ఫిష్ వండుకుని తినడం నేర్చుకుంటే బెటర్ అని ఈ పాఠం చెబుతోంది. అజర్‌భైజాన్‌లో కాకులు దూరని కారడివిలో, మైదానాల్లో, గనుల్లో షూటింగ్ చేసిన `వినయ విధేయ రామ` టీమ్ ఎలాంటి సన్నివేశంలో ఉందో ఈ ఒక్క సీన్ ద్వారా చూపించేశారు ఉపాసన. ఎంతో కఠోరంగా ఉండే చోట ఇలా తెలివిగా వంటకాల్ని ఆరగించవచ్చని ప్రూవ్ చేశారు.
చేపల వంటకం అంటే మాంచి ఘుమఘుమలాడే మసాలాలు కావాలి. ఉప్పు కారం చేపకు పెట్టాలి. అవేవీ లేకుండానే పచ్చి చేప.. ఆలివ్ ఆయిల్.. లెమన్ ఉపయోగించి ఎంత సింపుల్ గా వంట చేశారు? అందుకు పూర్వా కాలం అవ్వలు ఉపయోగించే బొగ్గుల కుంపటి ఉపయోగించారు. వ్వావ్! నైస్ ఫిష్ వంటకం!! అంటూ చరణ్ తెగ పొగిడేశారు. ఫైవ్ స్టార్ ఫుడ్ లేనిదే.. క్వాలిటీ ఫుడ్ లేనిదే అంత పెద్ద స్టార్ హీరో ఇలాంటి వంటకం తిన్నారా? అంటే తినక ఏం చేస్తారు? సన్నివేశం అలాంటిది. అయితే ఇలాంటి టైమ్ లోనే మనలోని క్రియేటివిటీ బయటపడేది అని `వినయ విధేయ రామ` వంట మాస్టార్ నిరూపించాడు. ప్రొడక్షన్ వంటకం వాళ్లు పకడ్భందీగా అక్కడ కాలువలో చేపలు పట్టి ఆన్ లొకేషన్ వండి చెర్రీ & టీమ్ కి తినిపించి ప్రశంసలు అందుకున్నారు. పరిమిత వనరులతో ఒక బొగ్గుల కుంపటిపై ఈ వంటకం ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ?