Begin typing your search above and press return to search.

షేక్ చేసేస్తున్న చిన్న చెర్రీ

By:  Tupaki Desk   |   10 Nov 2017 6:17 PM GMT
షేక్ చేసేస్తున్న చిన్న చెర్రీ
X
అభిమాన హీరోకు సంబంధించిన ఓ విషయమైనా ఫ్యాన్స్ ను తెగ అలరిస్తూ ఉంటుంది. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. మెగా పవర్ స్టార్ గా తన సత్తా చాటుతూ.. కోట్లాది మందిని మెప్పిస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ లో చెర్రీ బిజీగా ఉండగా.. తన భర్తపై కోపం వస్తే ఏం చేస్తుందో చెప్పేసింది చెర్రీ వైఫ్ ఉపాసన.

సోషల్ మీడియా పేజ్ లో ఓ బుజ్జాయి ఫోటో పోస్ట్ చేసిన ఉపాసన.. "నాకు ఎప్పుడైనా మిస్టర్ సీ పై కోపం వస్తే.. ఈ ముద్దులొలికే ఫోటో చూసి కరిగిపోతాను" అంటూ కామెంట్ చేసింది. థ్రోబ్యాక్ థర్స్ డే హ్యాష్ ట్యాగ్ ను చూస్తే.. ఈ ఫోటోను షేరింగ్ చేయడం వెనక కాన్సెప్ట్ ఏంటో అర్ధమవుతుంది. అయితే.. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ అభిమానులు చాలాకాలం నుంచే.. అంటే సినిమాల్లోకి రాక మునుపు నుంచే తెలుసు. అయితే.. మరీ ఇంత చిన్న వయసులో.. ఇంత ముద్దులొలికే వయసునాటి పిక్ ఎప్పుడూ బయటకు రాలేదు.

ఉపాసన మాత్రమే కాదు.. ఈ ఫోటో చూస్తే ఎవరైనా కరిగిపోవాల్సిందే. అందుకే సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న రంగస్థలం మూవీని.. మార్చ్ ఆఖరి వారంలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.