Begin typing your search above and press return to search.

1950లో కనుగొన్న జ‌ప‌నీ ఫుడ్ తిన్న ఉపాస‌న‌

By:  Tupaki Desk   |   26 Oct 2022 5:33 AM GMT
1950లో కనుగొన్న జ‌ప‌నీ ఫుడ్ తిన్న ఉపాస‌న‌
X
RRR టీమ్ ప్ర‌స్తుతం జ‌పాన్ లో సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ ప్ర‌మోష‌న్స్ కోసం వారం ముందుగానే కుటుంబ స‌మేతంగా తార‌క్-చ‌ర‌ణ్ జ‌పాన్ కి వెళ్లారు. అక్క‌డ న‌గ‌రంలో విహ‌రించ‌డ‌మే గాక జ‌పాన్ లో రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను కూడా ఆస్వాధిస్తున్నారు. మ‌న స్టార్ల‌ను జ‌ప‌నీలు ఎంతో అభిమానిస్తున్నారు. ప్రేమ‌గా చూసుకుంటున్నారు. ఈ జంట‌లు అడుగుపెట్టిన ప్ర‌తిచోటా గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు. నోరూరించే రుచుల‌ను నాలుక‌కు అందిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ అద్భుత ఓపెనింగుల‌తో రికార్డు బ్రేక్ చేసింది. కొంత డ్రాప్స్ ఉన్నా స్థిరమైన క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతోంద‌ని ఒక రిపోర్ట్ కూడా అందింది.

ఇక జ‌పాన్ లో చెర్రోపాస‌నం సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ జంట ఫుల్ గా న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత‌కుముందే టోక్యో కూడా వెళ్లారు. ఇక ఆర్.ఆర్.ఆర్ జ‌ప‌నీ భాష‌లో విడుదలకు ముందు జపాన్ లోని ఒక రెస్టారెంట్‌లో రామ్ చరణ్ - ఉపాసన అభిమానులతో కలిసి భోజనం చేశారు.

ఈ ఫోటోని ఉపాసన స్వ‌యంగా త‌న‌ ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేసారు. ఈ జంట అభిమానులతో విలువైన సమయాన్ని గ‌డిపారు. రామ్ చ‌ర‌ణ్‌- ఉపాసన జంట ఈ ఫోటోలో నవ్వులు కురిపిస్తూ టేబుల్ కి ఎదురుగా కూర్చున్నారు. అభిమానులు కూడా నవ్వుతూ పోజులిస్తూ క‌నిపించారు. ఫోటోను షేర్ చేస్తూ రామ్‌తో పాటు పలువురిని ఉపాసన ట్యాగ్ చేసింది.

తాజాగా ఉపాస‌న కామినేని మ‌రో స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసారు. ఇందులో జ‌ప‌నీ రుచుల్ని ఆస్వాధిస్తున్న ఉపాస‌న బ్లూ డ్రెస్ లో ఎంతో స్మార్ట్ గా క‌నిపించారు. అంతేకాదు జ‌ప‌నీ రెస్టారెంట్ ని ఉపాస‌న ఒక రేంజులో ప్ర‌మోట్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

నా `రామెన్`( హోటల్ పేరు) అనుభవం..అల్టిమేట్ ఉమామి (ఫుడ్)..రుచిక‌రం... ఇది 1950లో కనుగొన్న ఫుడ్. నిజంగా జపనీస్ సోల్ ఫుడ్. ఇలాంటివి జపాన్ లో 50 వేలు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. కేవలం రామెన్ మాత్రమే ఇలాంటి రుచిక‌ర‌మైన ఆహారాన్ని అందిస్తోంది.. అని ప్ర‌చారం చేసింది. మొత్తానికి జ‌ప‌నీ రెస్టారెంట్ కి ఉపాస‌న ప‌బ్లిసిటీ బాగానే వ‌ర్క‌వుట‌య్యేట్టు ఉంది. జ‌పాన్ లో ప‌ని చేసే ఇండియ‌న్ బిజినెస్ మేన్ ల‌కు ఇది క‌నెక్ట‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు.

RRR ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ - ఉపాసన మంగళవారం వారి చార్టర్డ్ ఫ్లైట్ లో జపాన్ వెళ్లారు. ప్రమోషన్స్ కోసం రాజమౌళితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి అదేరోజు జపాన్ వెళ్లారు.

RRR, థియేట్రికల్ రన్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ₹1000 కోట్లకు పైగా వసూలు చేసింది మరియు దాని ఊపిరి పీల్చుకునే యాక్షన్ సెట్ ముక్కల కోసం భారీగా జరుపుకుంది, జపాన్‌లో భారీ విడుదలకు సిద్ధమవుతోంది. జూలైలో, RRR పేజీ యొక్క అధికారిక ఖాతా నుండి ఈ చిత్రం అక్టోబర్ 21 న జపాన్ అంతటా సినిమాల్లో విడుదల కానుందని పేర్కొంది.

RRR 1920 నేప‌థ్యంలో సాగే స్టోరి. పూర్వ స్వాతంత్య్ర కాలంలో జరిగిన కల్పిత కథ. ఇది ఇద్దరు నిజమైన హీరోలు పాపుల‌ర్ విప్లవకారుల జీవితాల ఆధారంగా రూపొందించిన‌ది. అల్లూరి సీతారామ రాజు -కొమరం భీమ్ క‌థ‌ల‌ను తెర‌పై ఆవిష్క‌రించారు రాజ‌మౌళి. రామ్ గా రామ్ చరణ్‌ నటించగా.. భీమ్ గా జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపించారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన‌ ఈ చిత్రం ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. రాజమౌళి తెర‌కెక్కించిన‌ బాహుబలి సిరీస్ స‌ర‌స‌న రికార్డులకెక్కింది.

గత కొన్ని నెలలుగా బియాండ్ ఫెస్ట్ లో భాగంగా USలోని అనేక నగరాల్లో RRR రీరిలీజైంది. ఈ నెల ప్రారంభంలో ఈ చిత్రం TCL చైనీస్ థియేటర్ లో ప్రదర్శిత‌మైంది. ప్రేక్షకుల నుండి ఉరుములతో కూడిన స్పందనను అందుకుంది. థియేటర్ లోని 932 సీట్లు 20 నిమిషాల్లో అమ్ముడయ్యాయని డెడ్ లైన్ నివేదిక నిర్ధారించింది. సింగిల్ షో నుండి ఈ చిత్రం $21,000 ఆర్జించ‌గా.. విడుదల నుండి ఇప్పటికి $221,156 వ‌ర‌కూ ఆర్జించింది. జ‌పాన్ లో ఇప్ప‌టికే తొలి వీకెండ్ నాటికే 4 కోట్ల మేర ఆర్.ఆర్.ఆర్ వ‌సూలు చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.