Begin typing your search above and press return to search.

పుట్టినరోజుకు ముందే చెర్రీకి ఉపాస‌న‌ గిఫ్ట్

By:  Tupaki Desk   |   25 March 2021 1:16 PM GMT
పుట్టినరోజుకు ముందే చెర్రీకి ఉపాస‌న‌ గిఫ్ట్
X
లైఫ్ అంటే సంతోషం.. ప్ర‌తి నిమిషం ఒక‌ మెమ‌రీ.. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జీవితంలో అనుక్ష‌ణం ఆనందంగా గ‌డ‌పాల‌నే కోరుకుంటారు. ఇక పుట్టిన‌రోజులు పెళ్లి రోజులు ఎప్ప‌టికీ మెమ‌ర‌బుల్ గా ఉండేందుకు స్పెష‌ల్ ప్లానింగ్స్ ఉంటాయి.

ఇంత‌కుముందు ఉపాస‌నకు చ‌ర‌ణ్ ఎన్నో అద్భుత‌మైన బ‌ర్త్ డే గిఫ్ట్ లు ఇచ్చారు. ద‌క్షిణాఫ్రికాలోని వైల్డ్ లైఫ్ పార్క్ లో విహారానికి సతీమ‌ణిని తీసుకుని వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఆనంద‌క్ష‌ణాల్ని ఉపాస‌న స్వ‌యంగా అభిమానుల కోసం సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. అవ‌న్నీ అభిమానుల్లో వైర‌ల్ అయ్యాయి.

మ‌రో రెండ్రోజుల్లో చ‌ర‌ణ్ బ‌ర్త్ డే వేడుక‌ల కోసం అభిమానులు భారీ ప్లాన్స్ చేస్తుండ‌గా.. అంత‌కుముందే త‌న‌కి ఓ రేర్ గిఫ్ట్ ని ఇచ్చింది ఉపాస‌న‌. తాజాగా రామ్ చరణ్‌తో దిగిన ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్‌ చేశారు. ఇది పెళ్లికి ముందే స్నేహితులుగా ఉన్న‌ప్ప‌టి ఫోటో. ఎంతో ల‌వ్ లీగా అలా ఓ ఖ‌రీదైన వింటేజ్ బైక్ వ‌ద్ద నిలుచుని రొమాంటిక్ ఫోజు ఇచ్చారు.

హ్యాపీ పీపుల్... తమ జీవితాల్లోని సంతోషానికి ఎవ‌రైనా ఆక‌ర్షితులే.. నేనూ దీనిని పూర్తిగా నమ్ముతాను. త్రోబ్యాక్ మెమ‌రీ అంటూ ఉపాస‌న ఫోటోకు కాప్షన్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ రేర్ ఫోటో చెర్రీ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. పెయిర్ చాలా బావుంది. ఎంతో గొప్ప రొమాంటిక్ ఫోటో అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. అపోలో హెల్త్ మ్యాగ‌జైన్ నిర్వాహ‌కురాలిగా ఉపాస‌న సేవ‌ల గురించి తెలిసిందే. చ‌ర‌ణ్ కి పెళ్లికి ముందే త‌ను స్నేహితురాలు. పెళ్ల‌యి ఏడేళ్ల‌వుతోంది. 14 జూన్ 2012లో ఈ జంట వివాహం జ‌రిగింది.