Begin typing your search above and press return to search.
పెర్ ఫెక్ట్: మెగా కోడలు షాకింగ్ లుక్
By: Tupaki Desk | 12 March 2019 2:43 PM GMT``నో బడీ ఈజ్ పెర్ఫెక్ట్ .. కరెక్ట్ యువర్ ఇంపెర్ఫెక్షన్స్ .. ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్! ``. మెగా కోడలు ఉపాసన ఇచ్చిన అద్భుతమైన కొటేషన్ ఇది. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన నేడు తన మేకోవర్ కి సంబంధించిన కొన్ని ఫోటోల్ని షేర్ చేసి దానికి ఈ ఆసక్తికర కొటేషన్ ని జోడించారు. ఉపాసన చెప్పినది 100 శాతం యువతరానికి అన్వయించాలి. ప్రతిదీ పెర్ఫెక్ట్ గా ఉండాలి! అనుకుంటేనే చిక్కు. ఉన్నంతలో పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నించకపోవడం పెద్ద తప్పు. సామాజిక విజ్ఞానాన్ని కలిగి ఉండడం.. సాటి మనిషికి ఆపదలో సాయం చేయడం... ఆరోగ్యంపైనా అవగాహన కలిగి ఉండడం.. ఫిట్ నెస్ కోసం శ్రమించడం .. ఇన్ని క్వాలిటీస్ ని ఉపాసనలో రెగ్యులర్ గా అభిమానులు చూస్తున్నారు.
ఏడాది కాలంగా ఉపాసనలో మార్పు ఎంతో! ఇదో షాకింగ్ రివల్యూషన్.. పెర్ఫెక్షన్ కోసం ఎంతగా శ్రమించాలో చేతల్లో ప్రూవ్ చేసిన ఉపాసనను చూసి అంతా నేర్చుకోవాల్సిందే. ప్రస్తుతం కొత్త రూపంతో మంత్ర ముగ్ధం చేస్తున్నారు. ఆ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో నవతరానికి షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారనడంలో సందేహమే లేదు. హబ్బీ రామ్ చరణ్ ఫిట్ నెస్ సీక్రెట్స్ గురించి .. సినిమాల గురించి నిరంతరం ఎప్పటికప్పుడు బోలెడన్ని అప్ డేట్స్ చెబుతున్న ఉపాసన ఇటీవలే మహా శివరాత్రి సందర్భంగా 800 ఏళ్ల నాటి పురాతన శివాలయంలో పూజలాచరించిన విషయాన్ని కూడా ఫోటోల రూపొలో షేర్ చేశారు. అపోలో హెల్త్ ఆర్గనైజేషన్స్ తరపున తన సామాజిక సేవల్ని ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తున్నారు. అలా ఇప్పటికే ట్విట్టర్ లో 10 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇదో రేర్ మూవ్ మెంట్ అనే చెప్పాలి.
రామ్ చరణ్ అభిమానులు రెగ్యులర్ గా ఉపాసనను సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తూ ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. హెల్త్ & ఫిట్ నెస్ కి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవాలన్నా ఉపాసన బెస్ట్ అడ్వయిజర్ అనడంలో సందేహం లేదు. సామాజిక సేవలు.. ప్రకృతి జీవనం వంటి విషయాల్లో రహస్యాల్ని ఉపాసన చాలా ప్రాక్టికల్ గా అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. అందుకే ఇంతమంది తనని అనుసరిస్తున్నారనడంలో సందేహం లేదు.