Begin typing your search above and press return to search.

చరణ్ కెరీర్ కోసం కొత్త దారులు!

By:  Tupaki Desk   |   30 March 2016 5:45 AM GMT
చరణ్ కెరీర్ కోసం కొత్త దారులు!
X
మెగా స్టార్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ అనుకున్నంత సాఫీగా లేదు. సినిమాల పరంగా తను ఇంకా చాలా ఎదగాల్సివుంది. చరణ్ కంటే మరో మెగా అల్లు అర్జున్ తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. 'మగధీర' తప్ప చరణ్ కెరీర్ లో ఆ రేంజ్ లో హిట్ వచ్చిన సినిమాలు లేవు. 'నాయక్','ఎవడు','గోవిందుడు అందరివాడేలే' చిత్రాలు మోస్తరుగా ఆడాయి. చరణ్ తోటి హీరోలు జాతీయ మీడియాలోను తమ పేరు వినిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో చరణ్ భార్య ఉపాసన తన భర్త పేరు నేషనల్ మీడియాలో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ కు చెందిన ఓ పీఆర్వోను చరణ్ కోసం నియమించినట్లు టాక్. చరణ్ కు సంబంధించిన సినిమా విషయాలు, ఇంటర్వ్యూలు ఇలా ప్రతి ఒక్కటి నేషనల్ మీడియాలో వచ్చే విధంగా ఆ పీఆర్వో చూస్తాడట. మొన్నటివరకు మహేష్ బాబు భార్య నమ్రత తన భర్త క్రేజ్ కోసం మహేష్ వెన్నంటే నిలిచి అన్ని పనులు చూసుకుంది. ఇప్పుడు చరణ్ కోసం తన భార్య ఉపాసన రంగంలో దిగింది. ఇప్పటికైనా చరణ్ తను అనుకున్న క్రేజ్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి..!