Begin typing your search above and press return to search.

'సైరా'ను యూత్‌ ఎందుకు చూడాలంటే..!

By:  Tupaki Desk   |   5 Aug 2019 7:06 AM GMT
సైరాను యూత్‌ ఎందుకు చూడాలంటే..!
X
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యాన్స్‌ తో పాటు అన్ని వర్గాల తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఉత్కంఠతతో దాదాపు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. సైరా పని పూర్తి చేసుకున్న చిరంజీవి తాజాగా తన కోడలు ఉపాసన ఎడిటర్‌ గా వ్యవహరిస్తున్న బి పాజిటివ్‌ మ్యాగజైన్‌ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు.

బి పాజిటివ్‌ ఆగస్టు సంచిక చిరు కవర్‌ ఫొటోతో వచ్చింది. సెలబ్రెటీల నుండి చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ ను దక్కించుకుంటున్న బి పాజిటివ్‌ మ్యాగజైన్‌ లో చిరంజీవి తన ఆరోగ్య రహస్యంను వెళ్లడించాడు. పలు విషయాలను చిరంజీవి నుండి ఉపాసన ఈ ఇంటర్వ్యూలో రాబట్టే ప్రయత్నం చేసింది.

సైరా చిత్రం గురించి ఉపాసన ప్రశ్నిస్తూ.. ఈ సినిమాను యూత్‌ ఎందుకు చూడాలి అంది. అందుకు చిరంజీవి స్పందిస్తూ ఈతరం వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మన పూర్వీకులు మన కోసం చేసిన త్యాగాలను ఈ చిత్రంలో చూపించడం జరిగింది. మన పూర్వీకులు చేసిన త్యాగాల గురించి.. వారి గొప్పదనం గురించి చెప్పే సినిమా ఇది. దేశ స్వాతంత్య్రం కోసం వారు చేసిన ప్రాణ త్యాగంను మనం ఎప్పుడు మర్చి పోవద్దు. వారి త్యాగం వల్ల వచ్చిన స్వాతంత్య్రంను మనం అనుభవిస్తున్నాం. అలాంటి వారికి ఘన నివాళి అర్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ చిత్రంను చూడాలంటూ చిరంజీవి అన్నారు.

సరేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటించింది. ఇంకా కీలక పాత్రల్లో అమితాబచ్చన్‌.. సుదీప్‌.. విజయ్‌ సేతుపతి.. జగపతిబాబు ప్రముఖ నటీనటులు ఉన్నారు. విజువల్‌ వండర్‌ గా ఈ చిత్రం ఉండేలా దర్శకుడు సురేందర్‌ రెడ్డి గ్రాఫిక్స్‌ వర్క్‌ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్‌ సినీ కెరీర్‌ లోనే కాకుండా టాలీవుడ్‌ చరిత్రలోనే నిలిచిపోయేలా ఈ చిత్రం ఉంటుందని మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు.