Begin typing your search above and press return to search.

మిస్ యు మిస్టర్ ‘సి’

By:  Tupaki Desk   |   7 Jan 2018 5:05 AM GMT
మిస్ యు మిస్టర్ ‘సి’
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భార్య ఉపాసన మధ్య ఎంత బాండింగ్ ఉంటుందో మెగా ఫాన్స్ తో పాటు సినిమా ప్రేమికులకు కూడా బాగా పరిచయమే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేంత టైం లేదు కాబట్టి చరణ్ కన్నా ఎక్కువ ఉపాసన అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. గత ఏడాదికి పైగా రంగస్థలం తప్ప వేరే ప్రపంచం లేకుండా తిరుగుతున్న రామ్ చరణ్ ప్రస్తుతం దాని చివరి దశ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. విడుదలకు మూడు నెలలే టైం ఉండటంతో సుకుమార్ కూడా పనులు వేగవంతం చేసాడు. సాధారణంగా విదేశాల్లో షూటింగ్ అయితే చరణ్ తో ఉపాసన కూడా అవకాశం ఉన్నప్పుడు కంపెనీ ఇచ్చేది. కాని ఇప్పుడు రంగస్థలం జరుగుతోంది రాజమండ్రి పరిసరాల్లో. వెళ్ళే ఛాన్స్ ఉన్నా ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ట్వీట్ చేసింది.

రెండేళ్ళ క్రితం బ్రూస్ లీ షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నప్పుడు చరణ్ తో కలిసి దిగిన ఒక మెమరీని షేర్ చేసుకున్న ఉపాసన అందులో తాము ప్రపంచంలో రెండు భాగాల్లో ఉన్నప్పటికీ కలిసే ఉన్నట్టే అని మెసేజ్ పెట్టి తమ మధ్య ఎంత గొప్ప అనుబంధం ఉందో చెప్పకనే చెప్పింది. గతంలో కూడా రంగస్థలం సెట్స్ ని విజిట్ చేసినప్పుడు అక్కడి దోమలని, చలిని తట్టుకుని మరీ రాత్రిళ్ళు షూటింగ్ చేస్తున్న రంగస్థలం యూనిట్ ని, భర్త డెడికేషన్ ని ప్రశంసించిన ఉపాసన ఈసారి మాత్రం కేవలం చరణ్ కోసమే పోస్ట్ చేసింది. మరో రెండు వారాల్లో రంగస్థలం షూటింగ్ మొత్తం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అజ్ఞాతవాసి మూవీతో పాటు దీని టీజర్ జోడిస్తారు అనే వార్త వచ్చినప్పటికీ దాని గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.