Begin typing your search above and press return to search.

వాయిదా పడ్డానికి ఉపాసనే కారణమా?

By:  Tupaki Desk   |   8 Dec 2017 12:46 PM GMT
వాయిదా పడ్డానికి ఉపాసనే కారణమా?
X
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ గా ఉన్న సెలబ్రిటీలలో రామ్ చరణ్ దంపతులు కూడా ఉన్నారు. ఉన్నత స్థాయిల్లో ఉన్న వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉపాసన మిస్టర్ సి అంటూ ఎదో ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ..మెగా అభిమానులకు సంతోషాన్ని అందిస్తూ ఉంటారు. వారి వ్యక్తిగత సంతోషాలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా వారికి దైవ భక్తి కూడా చాలా ఎక్కువే.

ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఈ మెగా దంపతులు కలిసి వెళుతుంటారు. అయితే ఉపాసన బిజినెస్ వ్యవహారాల గురించే కాకుండా కొన్ని పనులను ఏ సమయానికి చేయాలి ఎలా చెయ్యాలి అనే విషయంపై చాలా క్లారిటీతో ఉంటారట. అంతే కాకుండా న్యూమరాలజీ తో పాటు అస్ట్రోలజిని కూడా ఆమె చాలా ఫాలో అవుతారట. ఈకపోతే రీసెంట్ గా రంగస్థలం సినిమా ఫస్ట్ లుక్ డేట్ ని 8వ తేదీ నుండి 9వ తేదీకి మార్చిన సంగతి తెలిసిందే. అయితే వాయిదా పడటానికి కారణం రామ్ చరణ్ సతీమణే అని తెలుస్తోంది.

నిజానికి ముందుగా 8వ తేదీన ఫిక్స్ చేశారు. పవిత్రమైన పంచమి ఒకే గాని నెక్స్ట్ డే కూడా మంచి ఘడియలు ఉండడంతో షష్టి 9వ తేదీ ఉదయం 9 గంటలకు అయితే.. న్యూమరాలజీ ప్రకారం 9 టోటల్ వస్తుందని.. అలా ఫిక్స్ చేయించిందట ఉపాసన. అంతే కాకుండా డేట్ అండ్ టైమ్ మార్చినందుకు సంతోషం అంటూ ఉపాసన సోషల్ మీడియాలో కామెంట్ చేయడం చూస్తుంటే.. నిజంగానే ఈమె న్యూమరాలజీ కారణంగానే తేదీ మారిందని అంటున్నారు చూపరులు.