Begin typing your search above and press return to search.

ఉపాసన మల్లన్న దర్శనం.. గిరిజనులకు అభయం

By:  Tupaki Desk   |   10 Jun 2020 4:00 AM GMT
ఉపాసన మల్లన్న దర్శనం.. గిరిజనులకు అభయం
X
చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన మరోసారి ధాతృత్వం చాటుకున్నారు. మాధవసేవతోపాటు మానవసేవ కూడా చేసి మంచి మనసు చాటుకున్నారు.

దాదాపు 75 రోజుల లాక్ డౌన్ తర్వాత తెరుచుకున్న ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని మంగళవారం ఉపాసన దర్శించుకున్నారు. కరోనా నేపథ్యంలో దర్శనానికి 300మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. సాధారణ భక్తుల రద్దీ శ్రీశైలంలో కనిపించింది.

ఆలయ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరంతో మల్లన్నను దర్శించుకున్నారు ఉపాసన. అనంతరం స్థానికంగా ఉన్న ప్రజలకు, ఆలయ సిబ్బందికి పెద్ద మొత్తంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పెద్ద లారీలలో ఈ సరుకులను ఉపాసన తీసుకు రావడం విశేషం.

సుమారు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పులు, నూనెలు ఉపాసన వారికి అందించారు. పోలీసులకు కూడా పీపీఈ కిట్స్, నిత్యావసరాలు పంపిణీ చేశారు. తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని.. శుభ్రత పాటించాలని కోరారు. చాలా రోజుల తర్వాత శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఉపాసన అన్నారు.