Begin typing your search above and press return to search.

చరణ్ ఫ్యాన్స్ రచ్చ.. ఉపాసన ఎగ్జైట్మెంట్

By:  Tupaki Desk   |   10 Dec 2016 5:06 AM GMT
చరణ్ ఫ్యాన్స్ రచ్చ.. ఉపాసన ఎగ్జైట్మెంట్
X
ఎంత బ్యాగ్రౌండ్ అయినా ఉండొచ్చు.. వేల కోట్ల ఆస్తులుండొచ్చు.. ఎంతైనా పలుకుబడి ఉండొచ్చు.. కానీ సినిమా నటులకు ఉండే పాపులారిటీ ఇంకెవరికీ ఉండదన్నది వాస్తవం. అలాంటి పాపులారిటీ ఉన్న వాళ్లను పెళ్లాడే వాళ్లకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో అంచనా వేయొచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయి అయినా.. ఓ స్టార్ హీరోను పెళ్లాడాక ఆ పొజిషన్ ను బాగానే ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఉపాసన కామినేని కూడా చరణ్ భార్యగా అలాంటి ఎగ్జైట్మెంటే చూపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత భర్త నిఖార్సయిన హిట్టు కొట్టిన నేపథ్యంలో ఆమె ఆనందానికి అవధుల్లేవు.

ఆ మధ్య ‘ధృవ’ ప్రి రిలీజ్ ఫంక్షన్ కు హాజరు కాకుండా అందరిలోనూ సందేహాలు రేకెత్తించిన ఉపాసన.. ఈ సినిమా విడుదల తర్వాత తన ఎగ్జైట్మెంట్ ను బయటపెట్టింది. ఓ మాస్ థియేటర్లో ‘ధృవ’ సినిమా చూస్తున్న ప్రేక్షకులు.. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్లో చేసిన రచ్చను ఎవరో క్యాప్చర్ చేసి ఉపాసనకు ఇచ్చినట్లున్నారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన ఎగ్జైట్మెంట్ ను బయటపెట్టింది ఉపాసన. ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ అని.. చరణ్ కు భర్త అయినందుకు గర్వ పడుతున్నానని.. ‘ధృవ’ను సూపర్ హిట్టయినందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె వ్యాఖ్యానించింది. ఎప్పుడూ సినిమా వ్యవహారాలపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని ఉపాసన.. తొలిసారి ఇలా మెగా అభిమానుల రచ్చకు సంబంధించిన వీడియోను షేర్ చేసి.. తన ఎగ్జైట్మెంట్ ను పంచుకోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే.